అంతర్జాతీయం

దొడ్డిదారిన రాజీకి పాక్ యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఫిబ్రవరి 24: పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతీకార చర్యలకు సన్నద్ధమవుతోందన్న కథనాల నేపథ్యంలో పాకిస్తాన్ దొడ్డిదారిన రాజీ ప్రయత్నాలను మొదలుపెట్టిందా? తాజాగా వెలుగుచూస్తున్న కథనాలను బట్టి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దూత ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సడలి, రాజీమార్గం సుగమం అవుతోందన్న సంకేతాలు అందుతున్నాయి. జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈనెల 14న 41 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే అహమ్మద్ బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార వంటి అంశాలు దెబ్బతినడంతోపాటు ప్రతీకార చర్యలకు దిగవచ్చునన్న వార్తలు వెలువడుతున్నాయి. పాక్‌లో అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు రమేష్ కుమార్ వాంక్వానీ గత వారం భారత్‌ను సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తన వార్తా కథనంలో పేర్కొంది. ‘మా దేశం తరఫున సానుకూల దృక్పథంతో కూడిన సమగ్ర నివేదికను మోదీ, సుష్మా స్వరాజ్‌కు అందజేశాను. మా పట్ల వారికున్న అభిప్రాయంలో మార్పు వస్తుందనే నమ్ముతున్నాం’ అని పాక్ ప్రధాని దూత రమేష్ కుమార్ వాంక్వానీ సదరు వార్తా సంస్థతో ఫోన్‌లో మాట్లాడి తెలిపినట్టు తెలుస్తోంది. పాక్ దూత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సుష్మాతోపాటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన జనరల్ వీకే సింగ్‌ను సైతం కలుసుకున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఆహ్వానం అందిన ప్రపంచంలోని 185 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు పాక్ పీటీఐ నాయకుడు రమేష్ కుమార్ వాంక్వానీ కూడా ఒకరుగా ఉన్నారు. తన భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు ఆ పత్రికలో పేర్కొన్నారు.