అంతర్జాతీయం

‘పీరియడ్’కు ఆస్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్, ఫిబ్రవరి 25:జాతి వైషమ్యాల మధ్యసాగే అనూహ్య స్నేహానికి అద్దం పట్టిన ‘గ్రీన్‌బుక్’ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును అందుకుంది. అత్యధిక స్థాయిలో నాలుగు పురస్కారాలను బొహెమియాన్ రాఫ్సోడీ గెలుచుకుంది. 91వ అస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అల్ఫాసో కువారోన్ తీసిన ‘రోమా’చిత్రానికి అడ్డు కట్టవేసి ఉత్తమ ఆస్కార్‌ను గ్రీన్‌బుక్ ఎగరేసుకుపోయింది. మొత్తం మూడు అవార్డులను కైవసం చేసుకుంది. అయితే రోమా, బ్లాక్ ఫాంథర్ చిత్రాలు వివిధ కేటగిరీల్లో అత్యధిక అవార్డులను గెలుచుకున్నాయి. బ్లాక్ పాంథర్‌కు మూడు, రోమా చిత్రానికీ మూడు పురస్కారాలు దక్కాయి. ఈసారి అవార్డుల్లో భారత్ కూడా తన ఉనికిని చాటుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ గ్రామం నేపథ్యంగా తీసిన ‘పీరియడ్.ఎండ్ ఆఫ్ సెంటెన్స్’అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం లభించింది. రేఖా జెహ్‌తాబ్చీ దర్శకత్వం వహించిన ఈ డాక్కుమెంటరీ నిర్మించిన గునీత్ మోంగా ఆస్కార్ వేదికపై ప్రశంసలు అందుకున్నారు. కాగా, ఉత్తన చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకోనప్పటికీ రోమా చిత్రానికి గాను కువారన్ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను గెలుచుకున్నాడు. ‘ది ఫేవరెట్’చిత్రానికి గాను ఒలీవియా కోల్‌మన్ ఉత్తన నటి అవార్డును గెలుచుకుంది.‘బొహెమన్ రాఫ్‌సోడీ’లో నటనకు గాను రామి మాలెక్ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. తారా తోరణాలను సంతరించుకున్న 91 ఆస్కార్ అవార్డుల పండుగ ప్రత్యేకత ఎలాంటి వ్యాఖ్యాత లేకుండానే మూడు దశాబ్దాల తర్వాత సాగడం విశేషం. ఓ నల్లజాతి సంగీతకర్తకు ఆయన డ్రైవర్‌కు మధ్య సాగే సంబంధాలనే ఇతివృత్తంగా తీసిన గ్రీన్‌బుక్ చిత్రాన్ని అనీల్ అంబాని సారధ్యంలోని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బలపరచడం గమనార్హం. ఈ చిత్రానికి గాను మహెర్షాలా అలీ ఉత్తమ సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. అలాగే ఒరిజినల్ స్క్రీన్‌ప్లే పురస్కారమూ దీనికి దక్కింది. ది వైఫ్ చిత్రానికి గాను గ్లెన్‌క్లోజ్‌కే ఉత్తమ నటి అవార్డు దక్కుతుందని అందరూ భావించినప్పటికీ అంతిమంగా ది ఫేవరెట్ నటి కోల్‌మన్ దీన్ని ఎగరేసుకుపోయింది. క్క్వీన్ అన్నేగా ఆమె కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్,మిక్సింగ్ కేటగిరీలతో సహా మొత్తం నాలుగు ఆస్కార్‌లను బొహెమియన్ రాఫ్సోడీ గెలుచుకుంది. ఈ చిత్రానికి సంబంధించి సమీక్షలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ అత్యధిక స్థాయిలో నాలుగు పురస్కారాలను అందుకోవడం గమనార్హం. ఉత్తమ చిత్రంగా ఎన్నిక కాకపోయినా ‘రోమా’ ఇతర కేటగిరీల్లో తన సత్తా చాటుకుంది.

చిత్రాలు..‘పీరియడ్.ఎండ్ ఆఫ్ సెంటెన్స్’అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం