అంతర్జాతీయం

సంయమనం పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 26: భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ సంయమనం పాటించాలని, ఉగ్రవాదం విషయంలో భారత్ అంతర్జాతీయ సహకారం తీసుకుని పోరాటం సాగించాలని చైనా దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ ఉగ్ర శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత్ వైమానిక దళాలు దాడి చేసిన సంఘటనపై స్పందించిన చైనా దేశం తరఫున దేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లు కాంగ్ విలేఖరులతో మాట్లాడుతూ దాడికి సంబంధించిన నివేదికలను పరిశీలించామని చెప్పారు. ఈ సందర్భంగా తాను ఒకటి చెప్పదలిచానని, దక్షిణ ఆసియాలో భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు అత్యంత ప్రాముఖ్యత ఉన్నవేనని, దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత వంటివి సాధించాలంటే ఈ రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం చాలా అవసరమని, అది రెండు దేశాల ప్రజల అభివృద్ధికి మేలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇద్దరూ సంయమనం పాటించాలని, ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు కృషి చేయాలని ఆయన సూచించారు. తాము కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నామని, మంగళవారం తాము చేసిన దాడి పాక్‌పై కాదని, కేవలం ఉగ్రవాదం మీద మాత్రమేనని భారత్ పేర్కొనడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉగ్రవాదంపై పోరాటం అన్నది అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన వ్యవహారమని, దానికి అంతర్జాతీయ సమాజ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ అంతర్జాతీయ మద్దతు పొందాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇటీవల పుల్వామాలో జరిగిన దాడుల నేపథ్యంలో చైనా వాంగ్‌ఈతో పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఇరుదేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, తమతమ దేశంలో శాంతి, సుస్థిరతను ఏర్పర్చుకోవడానికి మరింత సహకారాన్ని అందించుకోవాలని సూచించారన్నారు.