అంతర్జాతీయం

దీటుగా బదులిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరంపై తన వాయుసేన ముందస్తు దాడి చేసిందని, ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, వారి శిక్షకులు, జైషే కమాండర్లు హతమయ్యారని భారత్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ ‘అనుచిత దాడి’కి పాల్పడిందని ఆరోపిస్తూ, తాను ఎంచుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రదేశంలో ఈ దాడికి బదులిస్తామని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌లోని బాలకోట్‌లో భారత్ వైమానిక దాడి జరిపిన కొద్ది గంటల తరువాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన నేషనల్ సెక్యూరిటి కమిటి (ఎన్‌ఎస్‌సీ) ప్రత్యేకంగా సమావేశమయింది. ఎలాంటి పరిణామాలకయినా సంసిద్ధులయి ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సాయుధ బలగాలను, పాకిస్తాన్ ప్రజలను కోరారు. భారత్ మంగళవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌లోని అతి పెద్ద జైషే మహ్మద్ శిక్షణ శిబిరంపై బాంబులు వేసి, దానిని ధ్వంసం చేసింది. ఈ ముందస్తు దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, వారి శిక్షకులు, సీనియర్ కమాండర్లు హతమయ్యారని ఢిల్లీలో అధికారులు ప్రకటించారు. ‘బాలకోట్ సమీపంలోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేసినట్టు, దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందినట్టు భారత్ చేసిన ప్రకటనను ఫోర్ (ఎన్‌ఎస్‌సీ) గట్టిగా తోసిపుచ్చింది. భారత ప్రభుత్వం మరోసారి తొందరపాటుతో అవాస్తవమయిన ప్రకటన చేసింది’ అని ఇస్లామాబాద్‌లో ఎన్‌ఎస్‌సీ సమావేశానంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ అనుచిత దాడికి దిగిందని, ఈ దాడికి పాకిస్తాన్ తాను ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో బదులిస్తుందని ఎన్‌ఎస్‌సీ తన ప్రకటనలో తెలిపింది. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్‌కు రావలసిందిగా ప్రపంచ మీడియాను ఆహ్వానించింది. భారత్ దాడికి పాల్పడిన ప్రదేశాన్ని సందర్శించాల్సిందిగా ప్రతిపాదించంది. ‘భారత్‌లో ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్నందున దేశీయ అవసరాల కోసం ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడి వల్ల ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలు తీవ్ర ప్రమాదంలో పడిపోయాయి’ అని పేర్కొంది. ‘జాతి మనోగతాన్ని తెలుసుకోవడానికి పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని నిర్ణయించడం జరిగింది’ అని ఆ ప్రకటన వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఖాన్.. బుధవారం నేషనల్ కమాండ్ అథారిటి (ఎన్‌సీఏ) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కూడా పిలుపు ఇచ్చినట్టు ఆ ప్రకటన వెల్లడించింది. ‘ఈ ప్రాంతంలో భారత్ బాధ్యతారహితమయిన విధానాన్ని ఎండగట్టడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ నాయకత్వంతో చర్చలు జరుపుతారు’ అని కూడా ఆ ప్రకటన వివరించింది.
అనంతరం రక్షణ, ఆర్థిక మంత్రులతో కలిసి ఖురేషి సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ దాడికి పాకిస్తాన్ బదులిస్తుందని అన్నారు. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాయని, అయితే పాకిస్తాన్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగడంతో కొద్ది నిమిషాలకే భారత యుద్ధ విమానాలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని ఖురేషి ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.