అంతర్జాతీయం

పంజాబ్‌లోకీ వచ్చేశాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 29: ఈస్టర్ రోజు ఓ పార్కుపై దాడికి పాల్పడి 74 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదులు ‘పంజాబ్‌లోనూ అడుగుపెట్టాం’ అనినవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన వారి సంఖ్య మంగళవారానికి 74కు చేరింది. గాయపడ్డవారిలో మరోఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ‘లాహోర్ ఘటన ద్వారా మేం పంజాబ్‌లో అడుగుపెట్టాం. ఇది నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఓ సందేశం’ అని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు. పేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డవారికి జిన్నా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆసుపత్రిలో 100 మంది చికిత్స పొందుతున్నారని ఎమర్జెన్సీ రెస్క్యూ రిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి దీబా షాన్‌వాజ్ స్పష్టం చేశారు. 203 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆమె చెప్పారు. ఆత్మాహుతి బాంబు దాడిలో 29 మంది చిన్నారులు, పది మంది మహిళలు మృతిచెందారు. మొత్తంగా 20 మంది క్రైస్తవులు చనిపోయినట్టు అధికారి పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది లాహోర్ పబ్లిక్ పార్క్‌లో జరిగిన విస్ఫోటనం కలకలం సృష్టించింది. ఈస్టర్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడే సమయంలో తాలిబన్లు పార్క్‌ను లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. క్రైస్తవులను టార్గెట్ చేసుకుని విధ్వంసానికి పాల్పడినట్టు తెహ్రీక్-ఎ- తాలిబన్ సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి సంకేతాలు పంపించామని సంస్థ ప్రతినిధి వెల్లడించాడు.