అంతర్జాతీయం

ఉగ్రవాదం ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, మార్చి 17: పుల్వామాలో జైషే అహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తూ వందలాది ఇండో-అమెరికన్లు హోస్టన్‌లోని ప్రధాన వీధుల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. మైనారిటీలపై దాడులు, వేధింపులు, టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న ఇస్లామాబాద్‌తో చర్చలకు ఆస్కారం ఇవ్వవద్దని ప్రపంచ దేశాలకు వారు విజ్ఞప్తి చేశారు. దాదాపు 300 మంది భారత సంతతి ప్రజలు కాశ్మీరీ పండిట్లపై దాడులతోపాటు టెర్రరిస్టు గ్రూపులకు ఆవాసం ఇస్తున్న పాక్ చర్యలను నిరసిస్తూ శనివారం సాయంత్రం హోస్టన్‌లోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 సీఆర్‌పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టడంతోపాటు భారత భూభాగంపై పాక్ తరచూ వివిధ రూపాల్లో దాడులకు తెగబడుతున్న తీరును గర్హిస్తూ ఆందోళకారులు బ్యానర్లు, ప్లకార్డులు చేతపట్టుకుని ‘అంతర్జాతీయ ఉగ్రవాద దేశం పాకిస్తాన్, టెర్రరిజాన్ని ఆపాలి, భారత్ భూభాగాంలోనిదే కాశ్మీర్, భారత్‌లో అనవసర జోక్యం వద్దు, మీ దేశంలోని మైనారిటీల భద్రతను చూసుకోండి’ అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యంగా తీవ్రవాదులకు స్థావరంగా నిలిచిన పాక్‌పై విమర్శలు గుప్పిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. హోస్టన్ చాప్టర్ ఆఫ్ గ్లోబల్ కాశ్మీర్ పండిట్ డయాస్పొరా తరఫున అంతకుముందు జరిగిన డాక్టర్ వీణా అంబార్డర్ అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైతం గత మూడు దశాబ్దాలుగా భారత భూభాగంపై పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఎన్నో రకాలుగా దాడులకు తెగబడుతున్నారని, ఇప్పటికే వేలాదిమందిని పొట్టనపెట్టుకున్నారని, ఇందుకు పాకిస్తాన్ పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ టెర్రిరిజాన్ని వ్యాపారంగా మార్చుతూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు అతిధులు ధ్వజమెత్తారు.
చిత్రం.. పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా అమెరికాలోని
హోస్టన్‌లో నిరసన ప్రదర్శన జరుపుతున్న ఇండో అమెరికన్లు