అంతర్జాతీయం

లండన్‌లో నీరవ్ మోదీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 20: పంజాబ్ నేషనల్ బ్యాంకును రెండు బిలియన్ కోట్ల రూపాయల మేర మోసగించిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. స్కాట్‌ల్యాండ్ యార్డ్ బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ వజ్రాల వ్యాపారిని తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ముందడుగా పేర్కొనవచ్చు. ఒక మనీ ల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్ కోర్టు నీరవ్ మోదీ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. హాల్‌బర్న్‌లో నీరవ్ దీపక్ మోదీ (పుట్టిన తేదీ 24.02.71)ని మంగళవారం అరెస్టు చేసినట్టు మెట్రోపాలిటన్ పోలీస్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అతన్ని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు కస్టడీలోకి బుధవారం హాజరుపరచినట్టు తెలిపారు. మొత్తం 13,500 కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాంకు సంబంధించి భారత్‌కు వెళ్లేందుకు నీరవ్‌మోదీ అంగీకరించినట్టు తెలియవచ్చింది. వెస్ట్‌ఎండ్‌లోని సెంటర్‌పాయింట్‌లో గల అపార్టుమెంట్‌లో విలాసవంతమైన త్రిబుల్ బెడ్‌రూం ప్లాట్‌లో నివసిస్తున్న నీరవ్ మోదీ (48)ని అధికారులు అరెస్టు చేశారు. తొలుత ఇతన్ని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులోని జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత లాంఛనంగా చార్జిషీట్ దాఖలవుతుంది. ఆ తర్వాత అతను బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇంగ్లండ్ కోర్టుల్లో ఇతని కేసు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసు తరహాలో విచారణ జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మాల్యాపై సైతం దేశానికి తిరిగి రప్పించే వారెంట్ గడచిన 2017లో జారీకాగా అప్పటి నుంచి మాల్యా బెయిల్‌పై కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అరవై మూడేళ్ల ఈ వ్యాపారవేత్త గత నెలలో యూకే హోం సెక్రటరీ సాజిద్ జావేద్ జారీ చేసిన వారెంట్ సర్ట్ఫికేషన్‌ను సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా 2018 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం నీరవ్ మోదీ పాస్‌పోర్టును రద్దు చేసిన తర్వాత గత సంవత్సరం లండన్ చేరుకున్న ఇతను సుమారు నాలుగుసార్లు బ్రిటన్‌లోపల, వెలుపల విస్తృతంగా పర్యటించినట్టు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా లండన్ నగరం నడిబొడ్డులోని ఓల్డ్‌బాండ్ స్ట్రీట్‌లో ఉన్న అతని జువలరీ బౌటెక్‌లో కొంతకాలం నివాసం ఉన్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం ఆ బౌటెక్ మూతపడింది. కాగా ఇప్పుడు అతను గడియారాలు, జువలరీ హోల్‌సేల్ వ్యాపారం, అలాగే ప్రత్యేక స్టోర్ల ద్వారా గడియారాలు, జువలరీ రీటెయిల్ వ్యాపారం సాగిస్తున్నట్టు తెలిసింది.