అంతర్జాతీయం

పాకిస్తాన్‌కు హిందువులు శత్రువులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, మార్చి 20: హిందువులు పాకిస్తాన్‌కు శత్రువులు అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఎమ్మెల్యే షేర్ అజామ్ వజీర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. సాక్షాత్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీపీ పీ సభ్యుడి వ్యాఖ్యలకు నిరసనగా మైనార్టీ వర్గానికి చెందిన హిందూ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ఉన్న మైనార్టీ ఎమ్మెల్యేలు రవి కుమార్, రం జిత్ సింగ్‌లు పీపీపీ సభ్యుడి వాచాలత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా అనంతరం వజీర్ సర్దుకుని తాను హిందూస్తాన్ తమ శత్రువు అని అనే బదులు పొరపాటున హిందువులు తమ శత్రువులని చెప్పానని, జరిగిన పొరపాటుకు క్షమాపణలు అడిగారు. అనంతరం వాకౌట్‌చేసిన మైనా ర్టీ ఎమ్మెల్యేలు తిరిగి సభలోకి రావాలని స భ తీర్మానం చేసి కోరింది. ఈ సందర్భంగా హిందూ ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడు తూ పాకిస్తాన్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూనే, పాక్‌లోని హిందువులు రాజ్యాంగానికి లోబడి ఉన్నారని, త మను వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. స్పీకర్ ముస్తాఖా ఘని పీపీపీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో ముగ్గురు హిందువులు సభ్యులుగా ఉన్నారు.