అంతర్జాతీయం

ధ్యానంతో మంచి మార్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 21: పాఠశాల విద్యలో భాగంగా విద్యార్థులకు ధ్యానం ప్రక్రియను నేర్పిస్తే వారిలో సామాజిక భావోద్వేగాలు తగ్గుతాయి. మానసిక వత్తిడి తగ్గుతుంది. చదువుపైన ఏకాగ్రత, సామాజిక పోటీతత్వం పెరుగుతుంది. అమెరికాతో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ (ఎస్‌ఈఎల్) విధానానికి ఎనలేని ప్రాధాన్యత పెరుగుతోంది. దీనివల్ల స్వీయ నియంత్రణ, సామాజిక అవగాహన, అప్రమత్తత, ఇతరులతో సంబంధాలు పెంచుకోవడం లాంటి నైపుణ్య పద్ధతులు పెరుగుతాయి. ధ్యానం వల్ల విద్యార్థుల జీవన విధానం మారుతుంది. విద్యార్థుల్లో ఎస్‌ఈఎల్ పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు సెంటర్ ఫర్ వెల్‌నెస్ అండ్ ఎచీవ్‌మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లారెంట్ వాలోస్క్ చెప్పారు. అప్పర్ ప్రైమరీ స్కూలు స్థాయి నుంచి ధ్యానాన్ని ప్రవేశపెడితే విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందిస్తుంది. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యానం నేర్పించాలని సూచించాం. ఈ విధానాన్ని అనేక పాఠశాల యాజమాన్యాలు అమలు చేస్తున్నాయి. మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు మాకు నివేదికలు అందుతున్నాయ అని వాల్కోస్ చెప్పారు. ధ్యానం చేస్తున్న విద్యార్థులు, ధ్యానం చేయని విద్యార్థుల కంటే మంచి మార్కులను స్కోరు చేస్తున్నారు. ధ్యానం చేయని పక్షంలో విద్యార్థుల్లో ప్రతికూల ఆలోచనలు, భావాలు పెరుగుతున్నాయి. ధ్యానం వల్ల మంచి ఆరోగ్యం కూడా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.