అంతర్జాతీయం

భారత్‌పై మరో ఉగ్ర దాడి జరిగితే.. పాకిస్తాన్‌కు తీవ్ర సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 21: పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్థిరమయిన, నిరూపణీయమయిన, తిప్పివేయడానికి వీలులేని చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి అమెరికా సూచించింది. భారత్ మీద మరో ఉగ్రవాద దాడి జరిగితే పరిస్థితి మిక్కిలి సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరించింది. ‘పాకిస్తాన్ తన దేశంలోని ఉగ్రవాద సంస్థలపై నిర్మాణాత్మకమయిన, స్థిరమయిన చర్యలు తీసుకునేలా మనం చూడవలసి ఉంది. ప్రధానంగా జైష్ ఎ మహమ్మద్ (జేఈఎం), లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ)లపై చర్యలు తీసుకునేలా చూడాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగకుండా చూడవలసి ఉంది’ అని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో బుధవారం ఒక సీనియర్ పరిపాలనాధికారి విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై నిజాయతీతో స్థిరమయిన చర్యలు తీసుకోకుంటే, మరోసారి భారత్‌పై ఉగ్రవాద దాడి జరిగితే, అది పాకిస్తాన్‌కు మిక్కిలి సమస్యాత్మకంగా మారుతుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్తతలు పెరుగుతాయి. అది ఇరు దేశాలకు ప్రమాదకరం’ అని ఆ అధికారి పేర్కొన్నారు. భారత వాయుసేన (ఐఏఎఫ్) పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జేఈఎం ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడి చేసిన తరువాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలేమిటని అడగ్గా, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా స్థిరమయిన, తిప్పివేయడానికి వీలులేని చర్యలు తీసుకునేలా అమెరికా, అంతర్జాతీయ సమాజం చూడవలసిన అవసరం ఉంది’ అని ఆయన బదులిచ్చారు. ‘ఇంత త్వరగా పూర్తి స్థాయిలో మదింపు వేయజాలం’ అని ఆ అధికారి పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇటీవల ఉగ్రవాద సంస్థలపై కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకుందని ఆ అధికారి అన్నారు. వారు కొన్ని ఉగ్రవాద సంస్థల ఆస్తులను స్తంభింపచేశారని, కొంతమంది ఉగ్రవాదులను అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ జేఈఎంకు చెందిన కొన్ని కేంద్రాలను తన పాలనాపరమయిన నియంత్రణలోకి తెచ్చుకుందని చెప్పారు.
‘పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై మరిన్ని చర్యలు తీసుకునేలా చూడవలసి ఉంది. అవి తిప్పివేయడానికి వీలులేని చర్యలు అయి ఉండాలి. ఎందుకంటే, మనం గతంలో ఏం జరిగిందో చూశాం. వారు కొంతమందిని అరెస్టు చేశారు. కొన్ని నెలల తరువాత వారిని వదిలేశారు. ఉగ్రవాద నాయకులు కొంత మంది విదేశాలకు వెళ్లడానికి, అక్కడ ర్యాలీలు నిర్వహించుకోవడానికి వీలు కల్పించారు’ అని ఆ అధికారి పేర్కొన్నారు.