అంతర్జాతీయం

ఇరాక్‌లో టైగ్రిస్ నదిలో పడవ బోల్తా :70 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాసుల్ (ఇరాక్), మార్చి 21: మాసుల్ పట్టణానికి సమీపంలో వరద ఉధృతిలో ఒక నావ మునిగిన దుర్ఘటనలో 70 మంది వ్యక్తులు మరణించారు. కుర్దుష్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున పడవలో నదిని దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనతో మాసుల్‌లో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. టైగ్రిస్ నదిలో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయారు. మొన్నటి వరకు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధీనంలో ఈ ప్రాంతం ఉండేదని పోలీసులు చెప్పారు. కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు పడవలో నది దాటి విహారయాత్రకు వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఇది ఒక విపత్తుగా పరిగణిస్తున్నట్లు ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన వారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 71 మంది మరణిస్తే 19 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాగా ఈ పడవ ప్రమాదం నుంచి మృత్యువాత పడకుండా 55 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. పడవలో నిర్దేశించిన దాని కంటే ఎక్కువ మంది ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇంజనీర్లు చెప్పారు. పైగా నది వరద ఉధృతంగా ఉండడంతోపడవ బోల్తా పడింది. ప్రధానమంత్రి అదీల్ అబ్దుల్ మహదీ ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు.