అంతర్జాతీయం

భారత శాంతిదళాల సేవలకు ఐరాస ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, మార్చి 22: ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో లెబనాన్, దక్షిణ సూడాన్‌లో భారత శాంతి దళం చేస్తున్న సేవలకు మంచిస్పందన వచ్చింది. ఈ దేశాల్లో స్థానిక ప్రజలతో కలిసి పోయి వారికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంలో ముందంజలో ఉన్నారు. రొమ్ము కేన్సర్‌పై అవగాహన, రైతులకు ఆధునిక వ్యవసాయం చేసే విధానాలను చెబుతున్నారు. ప్రధానంగా మహిళలకు ఈ అంశాలపై చక్కటి అవగాహన కల్పించినందుకు ఐక్యరాజ్యసమితి భారత శాంతి దళాలను ప్రశంసించింది. ఈ మేరకు సదస్సులను నిర్వహించేందుకు లెబనీస్ సాయుధ బలగాలు, స్థానిక అధికారులు భారత శాంతి దళాలకు సహకరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి తాత్కాలిక బలగాల్లో భారత శాంతి దళం పనిచేస్తోంది. ఇందులో డాక్టర్లు కూడా ఉన్నారు. సూడాన్ ప్రజలకు పశుపెంపకంపై కూడా శిక్షణ ఇస్తున్నారు. మేకలు, గొర్రెల పెంపకం, వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా తీసుకనే చర్యలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. స్ధానిక ప్రజలకు వెటర్నరీ పద్ధతులపై కూడా స్వల్పకాలిక శిక్షణ ఇస్తున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ సెనగర్ చెప్పారు. కల్నల్ ఎస్‌ఎం థామస్ మాట్లాడుతూ, ఇక్కడ మహిళలకు సౌదీ విద్యుద్దీపాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. భారత్ తరఫున ఇక్కడ శాంతి దళంలో 8 మిషన్లు పనిచేస్తున్నాయి.