అంతర్జాతీయం

పాక్‌లో ‘జిహాదీ’కి స్థానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 22: పాకిస్తాన్‌లో జిహాదీ సంస్థలకు, జిహాదీ సంస్కృతికి స్థానం లేదని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ గడ్డమీది నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలను అణచివేయాలని అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడుల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేశారు. జైష్ ఎ మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. దీంతో భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జేఈఎం శిక్షణ శిబిరాలపై వైమానిక దాడికి పాల్పడింది. ఇది జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడికి ప్రయత్నించగా, భారత వాయుసేన దానిని తిప్పికొట్టింది. ఇరు వర్గాల మధ్య గగనతలంలో జరిగిన పోరులో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన భారత మిగ్-21 విమానం కూడా కూలిపోయింది. ఆక్రమిత కాశ్మీర్‌లో దిగిపోయిన భారత్ పైలట్‌ను ఆ తర్వాత భారత్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఇక్కడ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ భారత్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల తన విద్వేష రాజకీయాలతో ఈ ఎన్నికల్లో తిరిగి గెలవాలని కోరుకుంటోందని ఆరోపించినట్లు ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ తెలిపింది. భారత్‌లో ఎన్నికలు అయ్యేంతవరకు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద భద్రతకు ప్రమాదం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని ఆయన పాకిస్తాన్ జాతిని ఉద్దేశించి కోరారు. పాకిస్తాన్ సాయుధ బలగాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయని, భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా గట్టిగా తిప్పికొడతాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నేషనల్ యాక్షన్ ప్లాన్‌కు, ఇప్పటి వరకు మిలిటెంట్ గ్రూపుల నిషేధానికి పాకిస్తాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయని ఆయన తెలిపారు. పాకిస్తాన్ గడ్డ మీద ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు తన ప్రభుత్వం అనుమతించబోదని, అందువల్ల నిషిద్ధ ఉగ్రవాద సంస్థలపై తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిహాదీ సంస్థలు, జిహాదీ సంస్కృతి చరిత్రలోకి ఆయన వెళ్తూ, అఫ్గానిస్తాన్‌లో సోవియట్ యూనియన్ మద్దతు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో అఫ్గాన్ యుద్ధం జరుగుతున్న కాలం నుంచి ఈ గ్రూపులు ఉనికిలో ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దశాబ్దాల పాటు అవి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడులో మొత్తం నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును తాము అధ్యయనం చేస్తున్నామని, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. ఈ పేలుడులో తమ దేశానికి చెందిన 44 మంది మృతి చెందారని ఆయన గుర్తుచేశారు. ఈ తీర్పు తమ దేశ ప్రజలను కలవరానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ పరిణామాన్ని తీవ్రంగా నిరసించిందని, ఆ విషయాన్ని భారత్‌కు తెలియజేసిందని ఆయన తెలిపారు.