అంతర్జాతీయం

పిఓకెను ఖాళీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్‌పై భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో స్పందించింది. తమ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి కాళీ చేయాలని కూడా హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి కరుడుగట్టిన ఉగ్రవాదులుగా గుర్తించిన వారికి, పాకిస్తాన్‌నుంచి వారి కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం తెలిపారు. గత రెండు రోజులుగా కాశ్మీర్‌కు సంబంధించి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి వెలువడిన ప్రకటనలను తాము చూశామని, ఐక్యరాజ్య సమితి కరుడుగట్టిన ఉగ్రవాదులుగా గుర్తించిన వారు ఈ కార్యక్రమాలకు నేతృత్వం వహించినట్లు కూడా తాము గమనించామని, వీరు గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను, పాక్‌లోని తాలిబన్ నేత అఖ్తర్ మన్సూర్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను అంతమొందించడాన్ని సైతం ఖండించారని చెప్పారు. అలాంటి ఉగ్రవాదులకు, వారి కార్యకలాపాలకు పాక్ ప్రభుత్వంనుంచి మద్దతు లభించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు. ‘మా దేశంలో ఎక్కడైనా హింసను రెచ్చగొట్టడం, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడాన్ని మానుకోవాలని, అలాగే మా ఆంతరంగిక వ్యవసారాల్లో తలదూర్చ వద్దని మరోసారి పాకిస్తాన్‌ను హెచ్చరిస్తున్నాం’ అని స్వరూప్ చెప్పారు. పాక్‌లో కాశ్మీర్ విలీనం దినాన్ని పాటించడం జమ్మూ, కాశ్మీర్ భూభాగాన్ని పాక్ దీర్ఘకాలంగా ఆక్రమించుకొని ఉందనే విషయాన్ని బైటపెడుతోందని, అందువల్ల అక్రమిత కాశ్మీర్‌నుంచి ఖాళీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవలసిందిగా పాకిస్తాన్‌ను భారత్ డిమాండ్ చేస్తోందని స్వరూప్ చెప్పారు.