అంతర్జాతీయం

సెలబ్రిటీల వల్ల పెరిగిన మోదీ ట్విట్టర్ వీక్షకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాను వీక్షించే వారి సంఖ్యను పెంచుకోవడానికి అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలను ఉపయోగించుకున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మోదీ 2014 ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కూడా ఇది దోహదపడిందని అమెరికాలోని యూనివర్సిటి ఆఫ్ మిచిగాన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత మోదీ భారత్‌లో ప్రజాజీవితంలో ఉన్న వారితో జరిపిన సంభాషణలపై అధ్యయనం చేయడానికి 2009 ఫిబ్రవరి, 2015 అక్టోబర్ మధ్య కాలంలో ఎట్ ది రేట్ నరేంద్రమోదీ నుంచి చేసిన 9,000 ట్వీట్లను జోయోజీత్ పాల్ పరిశీలించారు. మోదీ 2009లో ట్వీటింగ్ చేయడాన్ని ప్రారంభించారు. 2012 అక్టోబర్ నాటికి మోదీ ట్విట్టర్ ఖాతాను వీక్షించేవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతాను 46 మిలియన్లకు పైగా మంది వీక్షిస్తున్నారు.