అంతర్జాతీయం

కూలింది ఎఫ్-16 కాదు.. జేఎఫ్-17 థండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 25: భారత వైమానిక దాడుల సందర్భంగా కూలింది ఎఫ్-16 కాదని, చైనా సాంకేతిక సహకారంతో రూపొందించిన జేఎఫ్-17 థండర్ అని పాకిస్తాన్ వెల్లడించింది. వైమానిక దాడుల్లో పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని భారత్ మిగ్ -21 యుద్ధ విమానం కూల్చివేసింది. అయితే అది ఎఫ్- 16 కాదని పాక్ ఆర్మీ సోమవారం చెప్పుకొచ్చింది. బాలాకోట్‌పై జేషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఫిబ్రవరి 14 పుల్వామాపై ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ బాలాకోట్‌పై విరుచుకుపడింది. తమ భూభాగంలోకి వచ్చిన పాక్ ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసినట్టు భారత్ ప్రకటించింది. కాగా భారత్‌పై దాడులకు ఎఫ్-16ను ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్పాలని పాక్‌ను అమెరికా నిలదీసింది. అయితే దాడులను తిప్పికొట్టేందుకు చైనా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జేఎఫ్-17ను వాడామని పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘూ్ఫర్ తెలిపారు. చైనా-పాక్ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగానే జేఎఫ్-17ను వినియోగించినట్టు ఆయన చెప్పారు. భారత్‌పై తాము జరిపిన దాడులకు సంబంధించి వీడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అమెరికాకు స్పష్టం చేశారు. తమ దేశంలో రూపొందించిన ఎఫ్-16 కూలిపోవడంపై అమెరికా రక్షణశాఖ ఆరా తీసింది. పైగా ఒప్పందాన్ని ఉల్లంఘించి దానే్నలా వాడారని పాక్‌ను నిలదీసింది. ఎఫ్-16ను వాడడం, దాన్ని కూల్చివేసినట్టు భారత్ చెప్పడం వాస్తవమేనా?అని పాక్‌ను వివరణ కోరింది. తమ సైనిక సామర్థ్యాన్ని తెలపడానికే ఎదురుదాడికి దిగామని, భారత్ అణ్వస్తద్రాడులకు దిగితే తాము దానే్న అనుసరించాల్సి ఉంటుందని పాక్ సైనిక ప్రతినిధి ఘూ్ఫర్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే జేఎఫ్-17 థండర్‌ను వినియోగించినట్టు తెలిపారు.