అంతర్జాతీయం

సుప్రీం కోర్టులో నవాజ్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 26: పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఊరట లభించింది. జైలులో ఉన్న షరీఫ్ వైద్య చికిత్స చేయించుకోవడానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆరు వారాల బెయిల్ మంజూరు చేసింది. 69 ఏళ్ల షరీఫ్ అల్ అజీజియా స్టీల్ మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల కారాగార శిక్షను అనుభవించడానికి గత సంవత్సరం డిసెంబర్ నుంచి లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నారు. వైద్య చికిత్స చేయించుకోవడానికి బెయిల్ ఇవ్వాలని షరీఫ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 25న తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ షరీఫ్ ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఆసిఫ్ సరుూద్ ఖోసా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం షరీఫ్‌కు వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ బెయిల్ పొందిన కాలంలో షరీఫ్ దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
చిత్రం.. నవాజ్ షరీఫ్ కేసుపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో
పాక్ సుప్రీంకోర్టు ముందు మోహరించిన బలగాలు