అంతర్జాతీయం

ప్రపంచ చిత్రపటాలను ధ్వంసం చేసిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ తమ భూభాగంలో లేనట్లుగా ప్రచురితమైన 30వేల ప్రపంచ చిత్రపటాలను చైనా ధ్వంసం చేసింది. చైనా ఇప్పటికీ దక్షిణ టిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్ భాగమని వాదిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ నేతలు సందర్శించినప్పుడల్లా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటుంది. అదే సమయంలో భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని, ఎవరూ విడదీయలేరని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికి భారత్, చైనాలు సరిహద్దు వివాదంపై 22 సార్లు చర్చించాయి. కాని సమస్యలు పరిష్కారం కాలేదు. భారత్ చైనా మధ్య 3488 కి.మీ వాస్తవాధీన రేఖ ఉంది. తైవాన్‌ను కూడా చైనా తమ దేశంలో భాగమని భావిస్తుంటుంది. అరుణాచల్‌ప్రదేశ్, తైవాన్‌లు తమ దేశంలో భాగమని చెప్పకుండా ముద్రణైన 30వేల చిత్రపటాలను చైనా గుర్తించింది. ఈ చిత్రపటాలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో గుర్తించిన చైనా వెంటనే ధ్వంసం చేసింది.