అంతర్జాతీయం

పాక్‌లో మరో హిందూ బాలిక కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 26: ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతాన్ని మార్చుకునేలా చేసారన్న ఆరోపణల వేడి తగ్గకముందే పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో మరో మైనర్ హిందూ బాలిక కిడ్నాప్‌కు గురైంది. నేవార్ కమ్యూనిటీకి చెందిన 16 సంవత్సరాల ఈ హిందూ బాలికను బదిల్ జిల్లా నుంచి కిడ్నాప్ చేశారంటూ వెలుగులోకి వచ్చిన వార్త వైరల్‌గా మారింది. తన కుమార్తె కిడ్నాప్‌కు గురైందంటూ ఆ బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే, ఆ బాలిక ఎప్పుడు కిడ్నాప్‌కు గురైందన్న దానిపై స్పష్టత లేనప్పటికీ దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని సింధ్ అధికారులు ఆదేశించారు. అలాగే ఆ బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. సింధ్ రాష్ట్రంలో మైనర్ బాలికలకు వివాహం చేయడమన్నది చట్టరీత్యా నిషేధం. 18 సంవత్సరాలు దాటిన బాలికలకు మాత్రమే వివాహం చేసే అర్హత ఉంటుంది. ఇప్పటికే రవీనా (13), రీనా (15) అనే ఇద్దరు హిందూ బాలికలను హోలీ సందర్భంగా కొందరు కిడ్నాప్ చేసినట్టుగా వచ్చిన వార్తలు భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. వీరి కిడ్నాప్, బలవంతపు వివాహాలకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి రావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.