అంతర్జాతీయం

పరస్పరం పురోగమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: భారతదేశ పురోగతి పొరుగు దేశాల ప్రగతితో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి ఆయన గురువారం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్ట్‌ను ప్రారంభించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గంగా పనిచేసే ఈ ల్యాండ్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య వస్తు, సేవల మార్పిడికి ఉన్న ఆటంకాలను తొలగించడానికి, తగ్గించడానికి, ఇరు దేశాలను అనుసంధానం చేయడానికి సమీకృత చెక్ పోస్ట్ (ఐసిపి) ఎంతో దోహదపడుతుందని మోదీ అన్నారు. ఆర్థికాభివృద్ధి, అనుసంధానం అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని పేర్కొంటూ భారతదేశ పురోగతి దాని ఇరుగుపొరుగు దేశాల పురోగతితో ముడిపడి ఉందని ఆయన వివరించారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదయిన ఈ ల్యాండ్‌పోర్ట్ ప్రారంభం భారత్, బంగ్లాదేశ్ సంబంధాలలో ఎంతో ముఖ్యమయిన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యానికి పెట్రాపోల్-బెనాపోల్ ఎంతో కీలకమైన భూసరిహద్దు అని, ద్వైపాక్షిక వాణిజ్యంలో 50 శాతానికి పైగా దీనిమీదుగానే జరుగుతోందని వివరించారు. ఇరు దేశాల మధ్య భద్రత, వలస, సుంకాలు వంటి విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి పెట్రాపోల్ ఐసిపి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలకు, వస్తు రవాణాకు ఇది సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. ఏటా 15 లక్షల మంది ప్రజలు దీనిమీదుగా రాకపోకలు సాగిస్తున్నారని, లక్షన్నర ట్రక్కులు దీనిమీదుగా వెళ్తున్నాయని ఆయన వివరించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడుల పట్ల ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎల్లవేళలా హసీనాకు వెన్నుదన్నుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ల్యాండ్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్ట్ ప్రారంభం సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని
షేక్ హసీనాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ