అంతర్జాతీయం

బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌కు సుదీర్ఘ గడువిస్తే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ట్రాస్ బర్గ్ (ఫ్రాన్స్), మార్చి 27: బ్రెగ్జిట్ విషయమై బ్రిటన్ పునరాలోచనలో పడినందున ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునే ముందు దీర్ఘకాలం వాయిదా వేయాలని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ ఐరోపా దేశాల చట్టసభలను కోరారు. బ్రెగ్జిట్ వ్యూహంపై మళ్లీ సమీక్షించుకునే అవకాశాన్ని యూరోపియన్ యూనియన్ ఇవ్వాలన్నారు. దీనికి తగిన వ్యవధి ఇవ్వాలన్నరు. బ్రిటన్‌కు గడువు ఇవ్వడంపై అనేక దేశాలకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చన్నారు. వాస్తవానికి మార్చి 29వ తేదీన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న అంశంపై తుది నిర్ణయం యూరోపియన్ యూనియన్ తీసుకోవాల్సి ఉంది. కాని ఇప్పటికే అనేక మార్పులను పరిగణనలోకి తీసుకుని ఏప్రిల్ 12వ తేదీకి ఈయూ వాయిదా వేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుల్ మాక్రాన్ ఎక్కువ కాలం గడువు ఇచ్చేందుకు ఆసక్తిగా లేరు. మే 23వ తేదీన యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ గడువు ఇస్తే ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతాయని ఆయన చెప్పారు. యూరోపియన్ రాజకీయ అజెండాకు ఆటంకం కలిగించే విధంగా ఏ వ్యవహారం ఉండరాదన్నారు. కాగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు టస్క్ మాత్రం ఇంగ్లాండ్‌కు కొంత గడువు ఇవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు. ఇంగ్లాండ్‌లో మెజార్టీ ప్రజలు యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేయరాదన్నారు. గత శనివారం పెద్ద సంఖ్యలో బ్రిటన్ పౌరులు ఈయూలో బ్రిటన్ కొనసాగాలంటూ ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో ప్రజలు కదం తొక్కారు. టస్క్ మాట్లాడుతూ బ్రిటన్ విషయంలో వేచి చూసే ధోరణి మంచిదని, బ్రిటన్ ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఈయూపై ఉందని చెప్పారు.