అంతర్జాతీయం

60 వేల పౌండ్లకు టిప్పుసుల్తాన్ గన్ వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మైసూర్‌ను పాలించిన ఆఖరి రాజైన టిప్పు సుల్తాన్‌కు చెందిన అరుదైన కళాఖండాలను లండన్‌లో 107000 పౌండ్లకు వేలం వేశారు. బెర్క్‌షైర్‌లో జరిగిన ఈ వేలంలో టిప్పుసుల్తాన్ వాడిన ఖడ్గాలతో పాటు వెండితో తాపడం చేసి 20-బోర్ గన్, బాయ్‌నెట్‌లను వేలం వేశారు. ఈ వేలం పాటలో 14 బిడ్‌లు దాఖలు కాగా కేవలం వెండితాపడం వేసిన తుపాకే 60 వేల పౌండ్ల ధర పలికింది. టిప్పు సుల్తాన్ వ్యక్తిగత ఆయుధ సామాగ్రి నుంచి సేకరించినవిగా వీటిని భావిస్తున్నారు. 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పుసుల్తాన్ మృతి చెందిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మేజర్ థామస్ హార్ట్ ఆధ్వర్యంలో ఈ వస్తువులను స్వాధీనం చేసుకుని లండన్‌కు తరలించారు. ఆయుధాలకు సంబంధించిన కళాఖండాలను వేలం వేయడంలో ప్రసిద్ధిగాంచిన బెర్క్‌షైర్‌కు చెందిన ఆనండోనీ క్రిమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ వేలం పాటలో పలువురు బిడ్డర్లు పాల్గొన్నారు. ఇందులో భారత్ సంతతికి చెందిన వారు అధికంగా ఉన్నారు. కాగా ఇండియా హై కమిషన్ సహకారంతో ప్రైడ్ ప్రాజెక్టు నేతృత్వంలో భారత్‌కు చెందిన అరుదైన కళాఖండాలను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నం జరుగుతోంది.
ఇందులో భాగంగా ప్రపంచంలో భారత్‌కు చెందిన వస్తువులు, కళాఖండాల వేలం జరిగినా అందులో ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొని, వేలంలో దక్కించుకుని వాటిని భారత్‌కు తీసుకువస్తున్నారు. గత ఏడాది బీహార్‌లోని నలందాలో 12వ శతాబ్దానికి చెందిన బుద్ధ విగ్రహం చోరీ అయ్యి, లండన్‌కు చేరింది. అలాగే 220 సంవత్సరాల క్రితం నాటి టిప్పుసుల్తాన్‌కు సంబంధించిన జ్ఞాపకాలు, ఆయన వాడిన వస్తువులు, ఆ కాలం నాటి కళాఖండాలను వెనక్కి రప్పించడానికి కృషి చేస్తున్నామని, అందుకే వాటి వేలం పాటలో పాల్గొంటున్నట్టు ప్రైడ్ ఇండియా వ్యవస్థాపకుడు అనురాగ్ సక్సేనా తెలిపారు.