అంతర్జాతీయం

మా మతం స్వీకరించింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: ఇస్లాం మతాన్ని ఇష్టపడినందుకే ఆ మహిళను తాను పెళ్లి చేసుకున్నానని ఒక యువకుడు వాదిస్తూ ఇందుకు తగిన ఆధారాలు చూపిస్తుండగా, మరోపక్క ఆమె మైనర్ అని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎలా చేసుకుంటావంటూ అతనిపై ఎఫ్‌ఐర్ నమోదైంది. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంలో వెలుగుచూసింది. హిందూ మతానికి చెందిన ఒక మహిళ తమ ఇస్లాం మతాన్ని ఇష్టపడిందని, అందువల్లే ఆమెను తాను పెళ్లి చేసుకున్నానని ఒక వ్యక్తి చెబుతున్నాడు. ఇటీవలే ఇదే ప్రాంతంలోని ఇద్దరు టీనేజి బాలికలను బలవంతంగా పెళ్లి చేసుకుని మత మార్పిడి చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే మళ్లీ మరో సంఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల తమ కుమార్తెను నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆ బాలిక కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరి రామ్ కిశోరి లాల్ స్పందించి ఈ సంఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు. అయితే, ఆ హిందూ బాలిక ప్రస్తుతం ఇస్లాం మతం పుచ్చుకుందని, ఇపుడు ఆమె తన భార్య అని వాదిస్తూ ఇందుకు తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను మీడియా ప్రతినిధులకు ఆ యువకుడు చూపించాడు. ఆ బాలిక పీర్ జాన్ ఆఘా ఖాన్ సర్‌హండిలో ఇస్లాం మతం స్వీకరించిందని, అనంతరం ఆమెను ఈనెల 17న తాను సమారో పట్టణంలో తాను పెళ్లాడానని సదరు యువకుడు పేర్కొంటున్నాడు. అంతేకాకుండా తాను పెళ్లి చేసుకున్న బాలిక తండ్రి అంటున్నట్టుగా ఆమె మైనర్ కాదని, ఇపుడు ఆమె వయసు 19 ఏళ్లని ఉమర్‌కోట్ జిల్లాకు చెందిన ఆ యువకుడు వాదిస్తున్నాడు. ఇదిలావుండగా, ఇస్లామాబాద్ హైకోర్టు సైతం అపహరణకు గురైన ఇద్దరు బాలికలు (ఘోట్కి జిల్లాలోని సింధ్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల రవీనా, 15 ఏళ్ల వీణా అనే హిందూ బాలికలు)కు రక్షణ కల్పించాలని, మతం మార్చి, వారిని బలవంతంగా పెళ్లి చేసుకున్న ఘటనపై తగిన సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను మంగళవారం ఆదేశించింది.