అంతర్జాతీయం

‘పొకెమాన్’పై ఫత్వా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, జూలై 21: ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని కుదిపేస్తున్న ‘పోకెమాన్’కు సౌదీ అరేబియాలో బ్రేక్ పడింది. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకమని, దీన్ని ఆడకూడదంటూ సౌదీ మత పెద్దలు ఫత్వా జారీచేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రపంచమంతా పోకెమాన్ వెంట పరుగులు పెడుతున్న నేపథ్యంలో సౌదీ వాసులకు ఇది పిడుగులాంటిదే. ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు కారణమవుతోందంటే పోకీమాన్ సృష్టించిన సంచలనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పోకీమాన్‌ను సౌదీ అరేబియాలోని మత పెద్దలు నిషేధం విధించారు. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకమని, దీన్ని ఆడకూడదంటూ ఫత్వా జారీచేశారు. అయితే ఈ గేమ్ సౌదీ అరేబియాలో అధికారికంగా లభ్యం కాకపోయినా కొంతమంది అనధికారికంగా డౌన్‌లోడ్ చేసుకుని పోకీమాన్ కోసం వేట మొదలుపెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ మత పెద్దలు ఫత్వా జారీచేశారు. ఈ ఆట ఓ జూదం లాంటిదని, ఇస్లాం వ్యతిరేకించిన డార్విన్ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పాత్రలను సృష్టించారని వారు ఆరోపించారు. అంతేకాకుండా కొన్ని మతాలకు చెందిన గుర్తులు పోకీమాన్ ఆటలో వినియోగించారన్నారు.