అంతర్జాతీయం

కొలనుల్లోనే జీవి పుట్టుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోస్టన్, ఏప్రిల్ 14: అసలు ఈ భూమీద జీవజాతులు ఎలా ఉద్భవించాయన్నది అనాదిగా అంతుబట్టని ప్రశే్న! వందలూ, వేలూ కాదు, లక్షల్లోనే భూతలంపై జీవజాతులు అనాదిగా పరిఢవిల్లుతున్నాయి, వీటి వౌలిక ఆవిర్భావం గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలను ఆవిష్కరిస్తూ కొత్త అంశాలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. తాజాగా మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇందుకు సంబంధించి మరో కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అతి చిన్న కొలనుల్లోనే భూమీద జీవజాతుల ఆవిర్భావం జరిగి ఉండవచ్చునని, ఇంతకు ముందు వెల్లడైనట్టుగా సముద్రాల్లో కాదని అమెరికాలోని ఈ సంస్థకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. కేవలం 10 సెం.మీటర్ల లోతు కలిగిన ఈ కొలనుల్లోనే జీవజాతులు ఆవిర్భవించాయని చెప్పడానికి ఎంతో ఆస్కారం ఉందని అందుకు కారణం వీటిలో నైట్రోజన్ సాంద్రత అత్యంత బలీయంగానే ఉండడం అని వెల్లడించారు. ఈ కారణంగానే ఈ భూమీద తొలి జీవజాతి అంకురించి ఉండవచ్చునని మిట్ శాస్తవ్రేత్తలు గట్టిగా చెబుతున్నారు. ఈ లోతైన కొలనుల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్ ఇతర మూలకాలతో ప్రతిచర్యకు లోను కావడానికి ఎంతైనా ఆస్కారం ఉండి ఉంటుందని ఈ ప్రక్రియ కారణంగానే పుడమిపై తొలి జీవజాతి ఆవిర్భావం జరిగి ఉండవచ్చునని తెలిపారు. అదే అత్యంత లోతైన సముద్రాల్లో నత్రజని ఉన్నప్పటికీ అది ఇతర మూలకాలతో ప్రతి చర్య సాగించడానికి ఆస్కారం అతి తక్కువగా ఉంటుందన్నారు. జీవి ఆవిర్భావానికి నత్రజని అవసరమని భావిస్తున్న నేపథ్యంలో ఇందుకు సముద్రాల్లో కాకుండా కొలనుల్లోనే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పవచ్చునని ఎంఐటీకి చెందిన శాస్తవ్రేత్త సుకృతీ రంజన్ వెల్లడించారు. అందుకే కొలనుల నుంచి తొలి జీవి ఆవిర్భవించిందని చెప్పడానికి కారణం అందుకు బలమైన అవకాశం ఉండడం అని తెలిపారు. భూ వాతావరణంలోని నైట్రోజన్ విచ్ఛిన్నం కావడం వల్ల దాని అవశేషాలు సముద్రాల్లోనూ, చిన్న పరిణామం కలిగిన కొలనుల్లోనూ నిక్షిప్తమయ్యాయని తెలిపారు. సముద్రాల్లో నిక్షిప్తమైన నత్రజని ఇతర మూలకాలతో ప్రతి చర్యకు లోనయ్యేందుకు అతి తక్కువ అవకాశాలు ఉండడం కొలనుల్లో నిక్షిప్తమైన నైట్రోజన్ ఆక్సైడ్‌కు ఎక్కువ అవకాశం ఉండడం వల్లే ఇక్కడ నుంచి భూమీద తొలి జీవజాతి ఆవిర్భవించిన ఉండవచ్చునని తెలిపారు.