అంతర్జాతీయం

పాక్‌లో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 16: పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్‌లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం పడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలకు తోడు వరద నీటి ప్రభావంతో దాదాపు 28 మంది మరణించగా, 26 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి మీడియా కథనం ప్రకారం..మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన పడిన భారీ వర్షాల ప్రభావం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించబడ్డాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరదల తాకిడి వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. పాకిస్తాన్‌లోని ఈశాన్య, సెంట్రల్, తూర్పు ప్రాంతాల్లోని మట్టి ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల రహదారులు ఛిద్రమై రవాణాకు తీవ్ర ఆటంకం కలిగిందని ఇస్లామాబాద్‌లోని డాన్ అనే పత్రిక పేర్కొంది. పంజాబ్ ప్రాంతంలో పడిన భారీ వర్షాల కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కనీసం 9 మంది మరణించగా వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో సైతం భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తడంతో కనీసం 9 మంది మరణించగా, వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. మంగళవారం బలూచిస్తాన్‌లో సంభవించిన వరదల వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించగా వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్వెట్టా, గ్వాదర్, ఛగాయ్, హర్నాయ్, డ్యూకీ, జెవానీ, జెఫ్రాబాద్, కొహ్లూ, సిబి, బర్క్‌హాన్, ఛమన్ తదితర జిల్లాలో భారీ వర్షం పడడంతో కాల్వల్లో వరద నీరు ప్రవహిస్తోంది.