అంతర్జాతీయం

న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ ప్రైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 16: ద న్యూయార్క్ టైమ్స్, ద వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలను ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ వరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుటుంబానికి సంబంధించి విడివిడిగా పరిశోధనాత్మక కథనాలు ప్రచురించినందుకు ఈ రెండు పత్రికలకు సోమవారం పులిట్జర్ ప్రైజ్‌ను ప్రకటించారు. ‘ద న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై పరిశోధనలో భాగంగా వివరణాత్మక కథనాలను ప్రచురించింది. తన సంపద అంతా తాను స్వయంగా కష్టపడి పోగుచేసుకున్నదేనని ట్రంప్ చేసిన వాదన సత్యదూరమని, ఆయన కుయుక్తుల ద్వారా పన్ను చెల్లింపులను తగ్గించుకున్నారని ఆ కథనాలు బయటపెట్టాయి’ అని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటిలో జరిగిన ఒక కార్యక్రమంలో పులిట్జర్ ప్రైజ్ బోర్డ్ ప్రకటించింది. ట్రంప్‌తో తమకు సంబంధం ఉందని పేర్కొన్న ఇద్దరు మహిళలకు ఆయన 2016లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ముడుపులు చెల్లించిన రహస్యాన్ని బయటపెట్టినందుకు వాల్ స్ట్రీట్ జర్నల్ నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో పులిట్జర్ ప్రైజ్‌ను సాధించింది. 2018 ఫిబ్రవరిలో మర్జొరీ స్టోన్‌మాన్ డౌగ్లస్ హైస్కూల్‌లో జరిగిన ఊచకోతకు ముందు, తరువాత పాఠశాల, శాంతిభద్రతల అధికారులు విఫలమయిన తీరును బయటపెట్టినందుకు పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో సౌత్ ఫ్లోరిడాకు చెందిన సన్ సెంటినెల్ పులిట్జర్ ప్రైజ్‌ను దక్కించకుంది. వివిధ కేటగిరీల కింద మరికొన్ని పత్రికలు పులిట్జర్ ప్రైజ్‌ను సాధించాయి.