అంతర్జాతీయం

అబుదాబీలో తొలి హిందూ దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఏప్రిల్ 20: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబీలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. దీంతో యూఏఈలోని వేలాది మంది హిందువులు ఎంతో ఆనందించారు. అనేక మంది ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. బోచసన్వాసి శ్రీ అక్షర్-పురుషోత్తం స్వామినారాయణ్ సన్‌స్థా (బీఏపీఎస్) ఈ దేవాలయాన్ని నిర్మిస్తోంది. బీఏపీఎస్ ఆధ్యాత్మిక అధినేత మహంత్ స్వామి మహరాజ్ నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన పూజా స్థల్ వద్ద పవిత్రమయిన ఇటుకలను పేర్చారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపించిన సందేశాన్ని యూఏఈలో భారత రాయబారి నవ్‌దీప్ సూరి చదివి వినిపించారు. హిందూ దేవాలయ నిర్మాణానికి పూనుకున్న గల్ఫ్ దేశాన్ని మోదీ తన సందేశంలో అభినందించారు. ‘130 కోట్ల మంది భారతీయుల తరపున నా ప్రియమయిన స్నేహితుడు, అబుధాబీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయె ద్ అల్ నహ్‌యాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని మోదీ పంపించిన సందేశాన్ని సూరి చదివి వినిపించారు.