అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొరాక్, ఏప్రిల్ 23: సెంట్రల్ ఫిలిప్పీన్‌ను మంగళవారంనాడు భూకంపం వణికించింది. భారీ భూకంపం తాకిడికి దేశంలోని దక్షిణ ప్రాంతంలో దాదాపు 16 మంది దుర్మరణం చెందారు. భూకంపం తీవ్రతకు ఒక సూపర్ మార్కెట్ పూర్తిగా నేలమట్టమైంది. ఇందులో ఇరుక్కుపోయిన ఐదుగురు అసువులు బాశారు. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది రక్షించగలిగారు. యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొన్న ప్రకారం రెక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొనగా స్థానిక భూకంప కేంద్రం ఏజన్సీ మాత్రం ఆ తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.5 వరకు ఉందని తెలిపింది. ఈశాన్య సమార్ ప్రొవిన్స్ పరిధిలోని శాన్ జులియన్ టౌన్ సమీపంలో సంభవించిన ఈ భూకంపం ప్రభావం వల్ల సమీపంలోని ఇళ్లలో గల ప్రజలను, వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, పెద్దగా ఆస్తి నష్టం గానీ జరగలేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఛిద్రం కావడంతోపాటు, చిన్నచిన్న భవనాలు, ఒక చర్చికి నష్టం వాటిల్లినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశామని ఆ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌పోర్టుతోపాటు ఉత్తర ఫిలిప్పీన్స్‌లో పలు భవనాలు కూలిపోవడంతో వాటి కింద మరణించినవారి మృతదేహాలను తొలగించారు. చున్ సూపర్ మార్కెట్ భవనం కూలిపోడంతో దాని కింద మరణించిన ఐదుగురుతోపాటు పంపంగ ప్రొవిన్స్‌లోని పొరాట్ టౌన్‌లో ఇళ్లు కూలిపోవడంతో వాటి కింద మరణించిన మరో ఏడుగురి మృతదేహాలను సైతం బయటకు తీశారు. కూలిపోయిన భవనాలు, ఇళ్ల కింద చిక్కుకున్న వారిని రక్షించడంతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు రెడ్‌క్రాస్ వలంటీర్ల సేవలు, ఆర్మీ దళాలు, పోలీస్, పలు గ్రామాల ప్రజల సేవలతోపాటు క్రేన్లను ఉపయోగించి శిథిలాల తొలగింపుతోపాటు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.