అంతర్జాతీయం

లంకకు సమాచారం ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 24: కొలంబోలో ఈస్టర్ సందర్భంగా జరిగిన ఉగ్రదాడి గురించి తాము ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా, భారత్ దేశాల నిఘా విభాగాల నుంచి దాడి గురించిన ముందస్తు సమాచారం అందిందని శ్రీలంక మంత్రి హర్ష డి సిల్వ చేసిన ప్రకటన ఆసక్తిని రేపుతున్నది. అయితే, దాడి గురించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, శ్రీలంకకు సమాచారాన్ని సమకూర్చే ప్రసక్తే లేదని శ్రీలంకలోని అమెరికా రాయబారి అలైనా టెప్లిజ్ స్పష్టం చేశారు. ఇలావుంటే, ఈ ప్రమాదానికి తమ నిఘా వైఫల్యం కూడా కారణమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈస్టర్ రోజున ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని భారత్, అమెరికా వంటి దేశాల నిఘా విభాగాలు హెచ్చరించాయని, కానీ, లంక అధికారులు దృష్టి పెట్టలేదని పేర్కొంది. స్వయంగా లంక మంత్రి కూడా భారత్, అమెరికా దేశాల నుంచి సమాచారం అందిందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, తమ నుంచి లంకకు ఎలాంటి సమాచారం వెళ్లలేదని అమెరికా సర్కారు తరఫున అలైనా టెప్లిజ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపింది.
లంక మంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. ఒకరు ఏం చెప్పారన్నది తనకు అనవసరమని, తాను మాత్రం అమెరికా తరఫున ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపింది. ఇతరత్రా ఏఏ వర్గాల ద్వారా సమాచారం వచ్చిందో తనకు తెలియని వ్యాఖ్యానించింది. అమెరికాకు మాత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తేల్చిచెప్పింది. కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్రవాద దాడిలో 350 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పాల్గొన్న తొమ్మిది మంది ఆత్మాహుతి సభ్యులంతా స్థానిక ఉగ్రవాద గ్రూపులకు చెందిన వారేనని లంక అధికారులు అనుమానిస్తున్నారు. ఇంత వరకూ సుమారు 60 మందిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. తమ దేశంలోని నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌జేటీ)కి ఈ దాడితో సంబంధం ఉందని, ఆ సంస్థకు చెందిన వారే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని శ్రీలంక సర్కారు ఆరోపిస్తున్నది. అయితే, ఎన్‌జేటీ మాత్రం ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి సహకరించబోమని తేల్చిచెప్పింది.
చిత్రాలు.. నెగొంబోలో బుధవారం జరిగిన సామూహిక అంత్యక్రియలకు హాజరై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న అనూష కుమారి. కొలంబో వరుస బాంబు పేలుళ్లలో ఆమె భర్త, ఇద్దరు పిల్లలను కోల్పోయింది. గాయాలతో బయటపడిన ఆమె సర్వస్వం కోల్పోయానంటూ రోదిస్తోంది.
* కొలంబో బాంబు పేలుళ్ల మృతుల సామూహిక ఖననానికి ఏర్పాట్లు చేస్తున్న కార్మికులు.