అంతర్జాతీయం

దేశ ద్రోహం కేసు విచారణకు ముషారఫ్ రాకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 28: దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (75) దుబాయ్ నుంచి వెనక్కి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పాక్‌కు వెళ్ళరాదని కుటుంబ సభ్యుల వత్తిడితో పాటు వైద్యు ల వత్తిడి కూడా ఆయనపై ఉం ది. ముషారఫ్‌పై 2014లో ప్రత్యేక కోర్టు దేశ ద్రోహం నేరారోపణ చేసింది. అయితే 2016 సంవత్సరంలో ముషారఫ్ వెన్నుపూసలో వచ్చిన నొప్పికి వైద్యం తీసుకోవడానికి దుబాయ్‌కి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముషారఫ్ పాక్‌కు వెళ్ళలేదు. కాగా వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందిగా ముషారఫ్‌కు సమన్లు జారీ అయ్యాయి. కాగా ముషారఫ్ కోర్టుకు హాజరై తన వాదన వినిపించుకోవాలని భావిస్తున్నట్లు ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రతినిధి అలీ నవాబ్ చిత్రాలీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వెన్నుపూసలో ఉన్న నొప్పి కారణంగా ఈ సమయంలో ఏ మాత్రం ప్రయాణం చేయరాదని, ప్రయాణం చేసి ప్రమాదం తెచ్చుకోరాదని వైద్యులు, కుటుంబ సభ్యులు ఆయనకు నచ్చజెబుతున్నారు. విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రత్యేక న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అసిఫ్ సరుూద్ ఖోస నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. హాజరుకానీ పక్షంలో క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 342 కింద స్టేట్‌మెంట్ రికార్డు చేసే హక్కును కోల్పోతారని హెచ్చరించింది. అంతేకాకుండా ఆస్తులు జప్తు చేస్తామని, పాస్ పోర్టు, జాతీయత రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ముషారప్ 1999 నుంచి 2008 వరకు పాలించారు.