అంతర్జాతీయం

శ్రీలంక పోలీసు చీఫ్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీ లంకలో ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆదేశించినా, ధిక్కరించిన పోలీస్ చీఫ్ జయసుందరను ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీడీ విక్రెమారత్నేను తాత్కాలిక పోలీసు చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21న ఈస్టర్ సండే సందర్భంగా లంకలోని మూడు చర్చిల్లో, మూడు లక్జరీ హోటళ్ళలో బాంబు పేలుళ్ళు జరగడంతో 253 మృత్యువాత పడగా, సుమారు 500 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుళ్ళకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా పోలీసు చీఫ్ పూజిత్ జయసుందరను ప్రభుత్వం ఆదేశించినా, అందుకు ఆయన అంగీకరించినప్పటికీ రాజీనామా లేఖను పంపించకుండా, అధికార నివాసాన్ని ఖాళీ చేయకుండా ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయన్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నాయి.
పోలీసు చీఫ్ జయసుందరతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ హేమసిరి ఫెర్మాండోను పేలుళ్ళకు వారి ఇంటెలిజెన్స్ వైఫల్యంగా ప్రభుత్వం భావించింది. అయితే ఆ దేశ నియామవళి ప్రకారం పోలీసు బాస్‌ను తొలగించాలంటే పార్లమెంటులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. కాగా రాష్టప్రతి సిరిసేన తొలి దశగా పోలీసు బాసును సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. శ్రీ లంకలో ముష్కరుల దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నప్పటికీ, పోలీసు బాసు తగు భద్రతా చర్యలు తీసుకోకపోవడం, అరికట్టకపోవడాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడలేకపోవడాన్ని రాష్టప్రతి సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యం అనే నింద పడిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ బాంబు పేలుళ్ళతో దేశానికి కోలుకోలేని దెబ్బ పడిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ దాడులు తామే జరిపినట్లు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ జాతీయ తౌహిత్ జమాత్ (ఎన్‌టీజే) బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో లంక ప్రభుత్వం ఎన్‌టీజేను, దాని అనుబంధ సంఘాలను సస్పెండ్ చేసింది.
ముఖ ముసుగులు వద్దు..
లంక వరుస పేలుళ్ళతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముస్లిం మహిళలు ఎటువంటి ముఖ ముసుగులు ధరించరాదని ఆయన ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్టప్రతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దేశ భద్రత దృష్ట్యా ఈ ఉత్తర్వులు వెలువరిస్తున్నామని, ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని తెలిపింది. ముఖముసుగులు ధరించడం వల్ల గుర్తుపట్టడం కష్టతరమవుతున్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దీనిని పాటించాలని సూచించింది.