అంతర్జాతీయం

శ్రీలంక బాంబు పేలుళ్లపై 6న కమిటీ నివేదిక వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 1: శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్లపై దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించిన త్రిసభ్య కమిటీ ఈ నెల 6న నివేదికను అందజేయనున్నది. గత నెల 21న మూడు చర్చిల్లో, మూడు ప్రధాన హోటళ్ళలో జరిగిన బాంబు పేలుళ్ళలో 253 మంది మృత్యువాత పడడం, సుమారు 500 మంది తీవ్రంగా గాయపడడం తెలిసిందే. పేలుళ్ళు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ నివేదక సమర్పించినా, పోలీసు చీఫ్ నిమ్మకు నీరెత్తి ఉన్నారంటూ లంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పోలీసు బాస్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిరిసేన విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి విజిత్ కె మలాల్‌గోడ, మాజీ ఐజి ఎన్ ఇలాంగకూన్, శాంతి-భద్రతల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి పద్మశ్రీ జయమనె్నను నియమించారు. ఈ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. అనేక మంది ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఇంకా పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించి వారి అభిప్రాయాలను రికార్డు చేసింది. భద్రతా వైఫల్యాలపైనా విశే్లషణ చేస్తున్నది. ఈ త్రిసభ్య కమిటీ ఈ నెల 6న రాష్టప్రతి సిరిసేనకు నివేదిక సమర్పించనున్నది.
బాంబు పేలుళ్లుజరిగిన ప్రాంతం (ఫైల్ ఫొటో)