అంతర్జాతీయం

ప్రతిష్ట నిలబడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, మే 2: జైషే మహ్మద్ చీఫ్ వౌలానా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి ఐరాస భద్రతా మండలి తన పవిత్రత, విశ్వసనీయతను చాటుకుందని సభలో ఇండోనేసియా రాయబారి దియాన్ త్రియానె్సహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. భద్రతామండలి ఆంక్షల కమిటీ ఆయన అధ్యక్షతనే జరిగింది. ఐరాసలో ఇండోనేసియా శాశ్వత రాయబారిగా సేవలందిస్తున్న త్రియానె్సహ్ 15 దేశాల సభ్య భద్రతా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ చీఫ్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వెనక సభ్యులు కృషి ఎంతో ఉందని ఆయనీ సందర్భంగా అన్నారు. ‘సభ్యులందరి సహాయ, సహకారంతోనే ఇంతటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోగలిగాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మీ నిర్ణయాలను అమలుచేశాను. మీ అండదండలు లేకపోతే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునేవాడిని కాదు’అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం కమిటీ సభ్యులందరి సమష్టి కృషి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని అధ్యక్షుడు ప్రశంసించారు. సంస్థకు గౌరవం, పవిత్రత, విశ్వసనీయత పెరగడంలో సభ్యుల సహాయ, సహకారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐరాస కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం, అంతకు ముందు పరిణామాలు, కమిటీ పనితీరుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ‘ ఇండోనేసియన్లగా మా వరకూ సంస్థ పట్ల విధేయతగానే ఉంటాం. అధ్యక్షుడిగా అయితే నా విధులు నేను నిర్వర్తించాను. ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు. సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా అందరి అభిప్రాయాలను ఆచరణలో పెట్టా’అని ఆయన స్పష్టం చేశారు. కాగా ఐరాసలో భారత శాశ్వత దూత సయ్యద్ అక్బరుద్దీన్ భద్రతా మండలి చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జఠిలమైన సమస్యను సమారస్యపూర్వకంగా, సజావుగా పరిష్కరించడం, సభను సమర్ధవంతంగా నిర్వహించడంలో ఇండోనేసియా రాయబారి చూపిన చొరవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అభినందించారు.