అంతర్జాతీయం

మళ్లీ పెళ్లి చేసుకున్న థాయిలాండ్ రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, మే 2: థాయిలాండ్ రాణి సుతిద తొలిసారి గురువారం రాజు రామా 10 పక్కన కూర్చొని ప్రజలకు కనిపించారు. రాయల్ బాడీగార్డ్‌లో డిప్యూటి హెడ్‌గా పనిచేసిన సుతిదను రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ వివాహమాడిన విషయాన్ని రాజప్రాసాదం బుధవారం రాత్రి ప్రకటించింది.
రాజు మహా వజిరలోంగ్‌కోర్న్.. రామా 10గా పట్ట్భాషేకం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కొంత కాలంగా తన సహచరిగా ఉన్న సుతిదను వివాహమాడటం విశేషం. బ్యాంకాక్‌లోని చరిత్రాత్మక క్వార్టర్‌లో గతంలో థాయిలాండ్‌ను పాలించిన చక్రి రాజవంశానికి చెందిన రాజుల విగ్రహాల వద్ద రాజు వజిరలోంగ్‌కోర్న్ నివాళులు అర్పిస్తుండగా, అతనితో కలిసి నివాళులర్పిస్తూ సుతిద కనిపించారు. సుతిద సంక్షిప్త జీవిత చరిత్రను రాజప్రాసాదం విడుదల చేసింది. రాజ పరివారంలో చేరడానికి ముందు సుతిద థాయి ఎయిర్‌వేస్‌లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేశారు. రాజు వ్యక్తిగత భద్రతా పరివారంలో అంగరక్షకురాలిగా సుతిద కొంతకాలం పాటు రాజు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు అతడిని వెన్నంటి ఉండటం జరిగింది. ఆమెకు 2016లో జనరల్ హోదాను కల్పించారు. సుతిద అనంతరం 2017 జూన్‌లో రాజు రాయల్ గార్డ్ డిప్యూటి కమాండర్‌గా నియమితులయ్యారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రాజు పోలీసులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా సుతిద అతడి వెనుక కూర్చొని ఉండటం కనిపించింది.
రాజు విజరలోంగ్‌కోర్న్‌కు ఇప్పటికే మూడుసార్లు వివాహమయింది. ఆ ముగ్గురికి విడాకులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన తరచుగా జర్మనీకి వెళ్తుంటారు. ఆయన వ్యక్తిగత జీవితం వివరాలు రహస్యంగా ఉంటాయి.రాజు వజిరలోంగ్‌కోర్న్ పట్ట్భాషేక కార్యక్రమం శనివారం మొదలయి మూడు రోజుల పాటు సాగుతుందని థాయిలాండ్ ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ పట్ట్భాషేక కార్యక్రమంలో సుతిద ఎలాంటి పాత్ర పోషిస్తారనే విషయం వెల్లడి కాలేదు. హిందూ, బౌద్ధమత సంప్రదాయాల కలయికగా ఈ పట్ట్భాషేకం జరుగుతుంది. థాయిలాండ్‌లో చివరిసారిగా 1950లో పట్ట్భాషేకం జరిగింది. అప్పుడు వజిరలోంగ్‌కోర్న్ తండ్రి భూమిబల్ అడుల్యాడేజ్ రాజుగా పట్ట్భాషిక్తుడయ్యారు. అంటే ఆయనకు రామా 9గా పట్ట్భాషేకం జరిగింది.