అంతర్జాతీయం

మరిన్ని దాడులు జరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 3: శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇస్లామిస్టు ఉగ్రవాదులు దేశ రాజధాని కొలంబోలో మరిన్ని దాడులు చేయడానికి పథకం పన్నారని అధికారులు శుక్రవారం హెచ్చరించారు. దీంతో దేశంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసుల అంతర్గత సర్క్యులర్ లీక్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొలంబో నగరంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న కొన్ని వంతెనలను, ఉత్తర కొలంబోలోని ఒక ఓవర్‌హెడ్ బ్రిడ్జిని సుమారు మే 6వ తేదీనాటికి ఇస్లామిస్టు ఉగ్రవాదులు పేల్చివేసే ప్రమాదం ఉందని ఆ సర్క్యులర్ హెచ్చరించింది. ‘దేశవ్యాప్తంగా ఆర్మీ, దాని అనుబంధ సంస్థలు పోలీసుల సహాయంతో ఉగ్రవాదులు, వారి రహస్య స్థావరాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి వంటి వాటికోసం విస్తృత స్థాయిలో తనిఖీలు, గాలింపులు కొనసాగిస్తున్నాయి. అవసరం మేరకు మరిన్ని బలగాలను ఇందుకోసం మోహరించడం జరిగింది’ అని శ్రీలంక సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్టర్ సండేనాడు ఇస్లామిస్టు ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 253 మంది మృతి చెందగా, మరో 500 మంది గాయపడ్డారు. అయితే, దాడులు జరగొచ్చని నిఘా వర్గాల నుంచి ముందే సమాచారం అందినప్పటికీ, ఆ దాడులను నివారించడంలో విఫలమయిన విషయాన్ని శ్రీలంక అధికారులు అంగీకరించారు.
సోషల్ మీడియా వేదికగా..
ఈస్టర్ సండే ఆత్మాహుతి దాడుల సూత్రధారి జహ్రాన్ హషీం ముస్లిమేతరులను హతమార్చడానికి సామాజిక మాధ్యమాలు వేదికగా బహిరంగంగా పిలుపునిచ్చారు. తరువాత ఆరుగురు ముస్లిం యువకులతో నెలల తరబడి ప్రైవేటు చాట్‌రూమ్‌లలో సంభాషించడం ద్వారా వారిని ఆత్మాహుతి దాడులకు ఒప్పించాడు. అంటే ప్రాణత్యాగానికి వారిని పురికొల్పాడని ముస్లిం కమ్యూనిటీ నాయకులు తెలిపారు. ఏప్రిల్ 21న షాంగ్రి-లా హోటల్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో హషీం కూడా మృతి చెందాడు. హషీం ధనవంతులయిన సోదరులు ఈహం ఇబ్రహీం, ఇన్‌షాఫ్ ఇబ్రహీంలను ఆత్మాహుతి దాడికి ఒప్పించడమే కాకుండా తాను చేయతలపెట్టిన దాడులకు వారినుంచి ఆర్థికంగా కూడా మద్దతు పొందాడు.