అంతర్జాతీయం

అమెరికాతో అనుకూలత ఏర్పడుతోంది: తాలిబన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 4: అమెరికాతో క్రమేణా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నదని తాలిబన్ తెలిపింది. వాషింగ్టన్ స్పెషల్ పీస్‌తో అఫ్గనిస్తాన్ జరుపుతున్న చర్చల ద్వారా ఇది కొలిక్కి వస్తున్నదని పేర్కొంది. ఫలితంగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా బలగాల ఉపసంహరణ జరిగే అవకాశం ఉందని తెలిపింది. తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరుదోహలో మీడియాతో మాట్లాడుతూ ఖతార్‌లో ఇరు దేశాల ప్రతినిధులు శాంతియుత వాతావరణలో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. చర్చల సందర్భంగా కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చారని తెలిపారు. 18 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి తెర పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా, నాట్కో బలగాలను ఉపసంహరించుకునేంత వరకూ కాల్పుల విరమణ చేయబోమని తెలిపారు.