అంతర్జాతీయం

కార్టిజో వైపే పనామా మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనామా సిటీ, మే 5: పనామా నగర నూతన అధ్యక్షుడిగా సోసియల్ డెమోక్రాట్ ‘లౌరెన్టినో కార్టిజో’ విజయం సాధించే అవకాశాలున్నాయి. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో పనామా నగరానికి చెందిన 2.7 మిలియన్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి భారీయెత్తున జరిగిన ప్రచారంలో అవినీతి ప్రధానాశంగా మారింది. 66 ఏళ్ల కార్టిజో ఓ వ్యాపారవేత్త, పశువుల పోషకుడు కూడా. కాగా ఆయన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి డెమోక్రాటిక్ చేంజ్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోములో రౌక్స్ కంటేకంటే 10 పాయింట్లు ముందున్నారని పోల్‌సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరి తర్వాత మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి రిజార్డో లోంబనా ఉన్నారు. కాగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచే వ్యక్తి జవాన్ కార్లోస్ వరేలా స్థానంలో అధ్యక్షు పీఠాన్ని అధిరోహిస్తారు. వరేలా పనామా రాజ్యాంగ నిర్ణయం మేరకు ఐదేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగలేకపోయారు. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. మూడేళ్ల క్రితం పనామా పేపర్స్ కుంభకోణం వెలుగు చూడటంతో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన ఈ అపఖ్యాతి మొత్తం దేశానే్న కుదిపేసింది. ఈక్రమంలో ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అవినీతి అంశమే ప్రచారాస్త్రంగా మారింది.
2010 నుంచి 2014 మధ్య పనామాలో జరిగిన భారీ పబ్లిక్ వర్క్ కాంట్రాక్టు పనులను బ్రెజిల్‌కు చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఓడెబ్రెచ్ట్‌కు అప్పగించడం పెద్దయెత్తున వివాదాస్పదమైంది. ఈ సంస్థ కాంట్రాక్టు పనుల కోసం 59 మిలియన్ డాలర్ల మొత్తాన్ని లంచంగా ఇచ్చిందని వెల్లడైంది. ఇలావుండగా ‘నిటో’గా పేరెన్నిక గన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కార్టిజో ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పనామాను రక్షించుకునేందుకు, పునర్వ్యవస్థీకరించేందుకు ప్రాధాన్యతనిస్తాన’ని పేర్కొన్నారు. ‘అవినీతి రహిత పాలన ద్వారా సరికొత్త చరిత్ర సృష్టిస్తాన’న్నారు. కాగా ‘కార్టిజోకు ఉన్న సమర్థత, అనుభవం, విజ్ఞానం విషయంలో ఆయనకే ప్రథమ తాంబూలం ఇస్తానని, ఆయన చెప్పినవన్నీ చేస్తారన్న నమ్మకం తనకుంద’ని మిగుయెల్ కార్రియో అనే ఒక ఇన్సూరెన్స్ సేల్స్‌మెన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలావుండగా ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ అభ్యర్థిగా రంగంలో ఉన్న లాయర్, జర్నలిస్టు లొంబానా దాదాపు 20 శాతం ఓటర్లను ఆకట్టుకుని ముందుకెళుతున్నారని పోల్‌సర్వే అంచనాలు తెలుపుతున్నాయి. అవినీతి నిర్మూలనపై ఈయన ప్రచార విధానం వైవిద్యంగా ఉందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. కార్టిజో 36 శాతం తర్వాతి స్థానంలో ఉన్న 45 ఏళ్ల లొంబానా సంప్రదాయ పార్టీలను సైతం వెనక్కునెట్టారు. వాషింగ్టన్‌కు చెందిన ఈ మాజీ పనామా వాస్తవ్యుడు ఆదివారం నాటి ఎన్మికల్లో ఏమేరకు విజయం సాధిస్తారో చూడాల్సివుంది. కాగా ఈ ఎన్నికల్లో పనామా ఓటర్లు అధ్యక్షుడితోబాటు 71 మంది డిప్యూటీలను, 81 మంది మేయర్లను, 700 మంది స్థానిక లామేకర్లను ఎన్నుకోవాల్సి వుంది. 1989లో మాన్యువల్ నోరీ నియంతృత్వానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ముగింపు పలికిన తర్వాత పనామా సిటీకి ఇవి ఆరో ఎన్నికలు.