అంతర్జాతీయం

‘ఉత్తర కొరియాది అదే తీరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, మే 5: ఎంతమంది ఎన్నిసార్లు ఎంతగా చెబుతున్నప్పటికీ ఉత్తరకొరియా తన తీరును మార్చుకోవడం లేదని దక్షిణకొరియా ఆరోపించింది. తాజాగా ఆ దేశం వివిధ రకాలైన క్షిపణులను పరీక్షించిన ఫొటోలను దక్షిణకొరియా విడుదల చేసింది. ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారని పేర్కొంది. అణ్వాయుధ పరీక్షలు ఉత్తరకొరియా కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు వెంటనే ఈ తీరుపై దృష్టి పెట్టాలని కోరింది. ఉత్తరకొరియా చేస్తున్న క్షిపణుల ప్రయోగం ఆసియా ఖండానికే కాకుండా యవత్ ప్రపంచానికి కూడా ప్రమాదకరంగా మారడం ఖాయమని దక్షిణ కొరియా హెచ్చరించింది.