అంతర్జాతీయం

స్వేచ్ఛ కోసం పోరాడిన మహావీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 5: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని ఏలిన టిప్పు సుల్తాన్‌కు ఘనంగా నివాళి అర్పించారు. టిప్పు సుల్తాన్ బానిసత్వంలో బ్రతకడం కన్నా స్వేచ్ఛ కోసం పోరాడటానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ‘టైగర్ ఆఫ్ మైసూర్’గా ప్రాచుర్యం పొందిన అప్పటి మైసూర్ రాజ్యం రాజు టిప్పు సుల్తాన్‌ను ఇమ్రాన్ ఖాన్ శనివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో శ్లాఘించారు. ‘ఈరోజు మే 4వ తేది. ఇది టిప్పు సుల్తాన్ వర్ధంతి రోజు. బానిసగా జీవించడం కన్నా స్వేచ్ఛకోసం, ఆ స్వేచ్ఛను పొందడం కోసం చేసే పోరాటంలో చావడం కోసం ప్రాధాన్యమిచ్చిన రాజు టిప్పు సుల్తాన్’ అని ఖాన్ తన ట్విట్టర్ పోస్ట్‌లో కొనియాడారు. ఇమ్రాన్ ఖాన్ టిప్పు సుల్తాన్ ధైర్యసాహసాలను శ్లాఘించడం ఇదే మొదటిసారి కాదు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఎ మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో నిర్వహించిన పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలోనూ ఇమ్రాన్ ఖాన్ టిప్పు సుల్తాన్ ధైర్య సాహసాలను ప్రశంసించారు. టిప్పు సుల్తాన్ నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. శ్రీరంగపట్నం స్వాధీనం సందర్భంగా ఆయన వీరమరణం పొందారు. అయితే, అంతకు ముందే రహస్య మార్గాల ద్వారా పారిపోవలసిందిగా ఫ్రాన్స్ సైనిక సలహాదారులు ఆయనకు సూచించారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం బాగా ప్రాచుర్యం పొందింది. ‘వెయ్యేళ్లు ఒక గొర్రెలాగా బ్రతకడం కన్నా ఒక్క రోజు పులిలాగా జీవించడం మేలు’ అని అప్పట్లో టిప్పు సుల్తాన్ సమాధానమిచ్చారు. టిప్పు సుల్తాన్ తన పాలనాకాలంలో అనేక పరిపాలనా సంస్కరణలను ఆవిష్కరించడం ద్వారా చరిత్రలో ప్రాచుర్యం పొందారు.
చిత్రం... పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్