అంతర్జాతీయం

పారిస్ దాడుల కేసులో ఐదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, ఏప్రిల్ 9: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని విమానాశ్రయంతో పాటు మెట్రో రైల్వే స్టేషన్‌లో ఇటీవల జరిగిన బాంబు దాడులపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో గత ఏడాది పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న మొహమ్మద్ అబ్రినీ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. ఇరాక్, సిరియాలను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద గ్రూపు గత నెల 22వ తేదీన బ్రసెల్స్‌లో జరిగిన బాంబు దాడుల్లో 32 మంది మృతిచెందగా, గత ఏడాది నవంబర్ 13వ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన దాడుల్లో 130 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అయితే బ్రసెల్స్‌కు పొరుగునే గల ఆండెర్‌లెక్ట్‌లో శుక్రవారం జరిపిన సోదాల్లో అబ్రినీతోపాటు గుర్తు తెలియని మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని దర్యాప్తు అధికారులు వివరించారు. బ్రసెల్స్, పారిస్ బాంబు దాడులపై దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులకు తాజా అరెస్టులతో కీలక సమాచారం లభ్యమవుతుందని భావిస్తున్నారు.