అంతర్జాతీయం

పాక్ స్టార్ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, మే 16: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్వాదర్‌లోని పెరల్ కాంటినెంటల్ ఫైవ్ స్టార్ హోటల్‌లోకి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. దీంతో ఉగ్రవాద నిరోధక పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు హోటల్‌ను చుట్టుముట్టినట్లు గ్వాదర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అస్లం బంగూల్జాయి తెలిపారు. తొలుత ముగ్గురు ఉగ్రవాదులు ఆ హోటల్‌లోకి బలవంతంగా వెళ్ళేందుకు ప్రయత్నించగా, అక్కడ సెక్యూరిటీ గార్డు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఉగ్రవాదులు సెక్యురిటీ గార్డుపై కాల్పులు జరపడంతో గార్డు మృతి చెందాడని ఆయన తెలిపారు. కాల్పుల శబ్ధానికి హోటల్‌లో నివసిస్తున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారని ఆయన చెప్పారు. అయితే సైనిక దళాలు, పోలీసులు హోటల్‌లో ఉన్న వారిని 95 శాతం వరకు బయటకు రప్పించగలిగారని ఆయన తెలిపారు. వీరిలో ఎక్కువగా వ్యాపారులు ఉన్నారని, కొంత మంది విదేశీయులూ ఉన్నారని, వారందరినీ క్షేమంగా హోటల్ నుంచి వెలుపలికి తీసుకుని వచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు సైనిక దళాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇలాఉండగా ఈ ఘటనను బలోచిస్థాన్ ముఖ్యమంత్రి జామ్ కమల్ ఖాన్ అల్యాని తీవ్రంగా ఖండించారు. హోటల్‌లో ఉన్న పర్యాటకులకు ఎటువంటి హాని జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.