అంతర్జాతీయం

పర్యావరణ పరిరక్షణే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 12: ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిర్ణయాత్మకమయిన, ముఖ్యమయిన సమస్య వాతావరణ మార్పు అని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుపై చరిత్రాత్మక పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చిన మూడేళ్ల తరువాత తిరిగి వాతావరణ మార్పు అంశం ఐరాసలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించే దిశగా సాగుతోంది. వాతావరణ మార్పును నిరోధించే దిశగా పురోగతి సాధించడానికి ఐరాస వచ్చే వారం ఒక భారీ చర్య చేపట్టనుంది. ఆంటోనియో గుటెరెస్ వచ్చే వారం న్యూజిలాండ్, అనేక పసిఫిక్ ద్వీపకల్ప దేశాలలో పర్యటించనున్నారు. వాతావరణ మార్పు కారణంగా ఈ ప్రాంతంలో సముద్ర మట్టాలు పెరుగుతూ ఇలాంటి చిన్న దేశాల అస్థిత్వానికే ముప్పు ఏర్పడింది. వాతావరణ మార్పును నిరోధించడానికి చేపట్టిన దౌత్యపరమయిన కృషి సెప్టెంబర్ నెలలో ఐరాసలో క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌తో ముగుస్తుంది. వాతావరణ మార్పును నిరోధించడానికి ఈ కార్యక్రమం చివరి అవకాశంగా భావిస్తున్నారు. వాతావరణ మార్పును నిరోధించడంలో మనం విఫలమవుతున్నామని గుటెరెస్ గత వారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘వాతావరణ మార్పు వేగంగా జరుగుతోంది. ఈ ధోరణిని మనం నిరోధించకుంటే, మొత్తం ప్రపంచానికే విషాదంగా పరిణమిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఫిజీ, టువలు, వనౌతులలో తుపాన్లు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా జీవనం అస్తవ్యస్తమయిన కుటుంబాలను గుటెరెస్ కలుసుకుంటారు. వాతావరణ మార్పు కారణంగా పసిఫిక్ మహా సముద్రం నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపకల్పాలు తీవ్రమయిన ముప్పును ఎదుర్కొంటున్నాయి. లోతట్టులో ఉన్న కొన్ని దేశాలయితే పూర్తిగా సముద్రంలో మునిగిపోయి అదృశ్యమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.