అంతర్జాతీయం

ప్రాజెక్టులను దెబ్బతీసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 12: పాకిస్తాన్‌లోని గ్వాడార్ నగరంలో గల ఒక విలాసవంతమయిన హోటల్‌పై జరిగిన దాడిని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఖండించారు. దేశ అభివృద్ధి ప్రాజెక్టులను, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ విద్రోహ చర్యకు ఒడిగట్టారని ఆయన పేర్కొన్నారు. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓడ రేవు నగరమయిన గ్వాడార్‌లోగల పెరల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్‌ను ముగ్గురు సాయుధ మిలిటెంట్లు శనివారం ముట్టడించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక గార్డు మృతి చెందాడు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముగ్గురు మిలిటెంట్లను హతమార్చాయి. ‘ఇలాంటి ప్రయత్నాలు ప్రత్యేకించి బాలోచిస్తాన్‌లో జరగడం మన అభివృద్ధి ప్రాజెక్టులను, ఆర్థిక సుసంపన్నతను దెబ్బతీయడానికి జరిగిన విద్రోహ చర్యలే అవుతాయి. విద్రోహులు తలపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వం సఫలం కానివ్వబోదు’ అని ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఈ దాడిని ఖండించడంతో పాటు మిలిటెంట్ల దాడులకు సెక్యూరిటి గార్డ్ తొలుత స్పందించిన తీరును, ప్రజల ప్రాణాలను బలగొనాలన్న ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టడంలో భద్రతా బలగాలు చూపిన తెగువను ఆయన ప్రశంసించారు. పీసీ హోటల్‌పై దాడి తన పనేనని నిషిద్ధ బాలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. 50 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో చేపట్టిన చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లోని ముఖ్యమయిన కేంద్ర స్థానాలలో గ్వాడార్ ఓడరేవు ఒకటి. పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్స్‌లకు చెందిన చైనా కార్మికులు అనేక మంది ఈ ఓడరేవులో పని చేస్తున్నారు. చైనా సీపీఈసీ కింద బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది.