అంతర్జాతీయం

బ్రిటన్‌లో అత్యధిక సంపన్నులు హిందుజా సోదరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 12: బ్రిటన్ సంపన్నుల జాబితాలో భారతీయ సంతతికి చెందిన సోదరులు ఆధిక్యత ప్రదర్శించారు. 22 బిలియన్ పౌండ్లతో హిందుజా సోదరులు నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించగా.. ముంబయిలో జన్మించిన రూబెన్ సోదరులు 18.66 బిలియన్ పౌండ్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకొన్నారు. లండన్‌లో హిందుజా గ్రూపు కంపెనీలను నడుపుతున్న శ్రీచంద్, గోపీచంద్ హిందుజాలు గత సంవత్సరం కన్నా 1.35 బిలియన్ల అధిక ఆస్తులతో ప్రథమ స్థానంలో నిలిచారని ‘సండే టైమ్స్’ సంపన్నుల జాబితాలో ప్రచురించింది. వీరితో పాటు లండన్‌కు చెందిన శ్రీ 83వ స్థానంలో ఈయన సోదరులు 73వ స్థానంలోను, అశోక్ 68వ స్థానంలో ఉండగా వీరు జెనీవాలోనూ, ముంబయిలోను ఉంటున్నారు. సంపన్నుల జాబితాలో ఉన్న వీరు 2018లో ప్రపంచవ్యాప్తంగా 40 బిలియన్ పౌండ్ల టర్నోవర్‌తో 50 కంపెనీలను నిర్వహిస్తున్నారు. కాగా, స్వతహాగా హిందువులైన హిందుజాలు మాం సం ఉత్పత్తులు, ఆల్కాహాల్ రంగాల్లో ఉన్నప్పటికీ గ్యాస్, ఐటీ, ఇంధన వనరులు, మీడియా, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ రంగాల్లో కూడా వీరు వ్యాపారాలు సాగిస్తున్నారు. లండన్‌లో రిజిస్టర్ అయిన హిందూజా ఆటోమోటివ్స్ ద్వారా 50శాతం పైగా అంటే దాదాపు 337 మిలియన్ పౌండ్ల లాభాలు ఆర్జిండంతో సంపన్నుల జాబితాలో ముందు నిలిచారు. వీరు లండన్‌లోని మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్‌కు చెందిన వైట్‌హాల్‌ను 350 పౌండ్లతో కొని దానిని లగ్జరీ హోటల్‌గా మారుస్తున్నారు. ఇది 2020లో ప్రారంభం కానుంది. అలాగే, ముంబయికి చెందిన 80వ స్థానంలో డేవిడ్, 77వ స్థానంలో సైమన్‌లు లండన్‌లో వాణిజ్యవేత్తలుగా రాణిస్తున్నారు. ఇక రూబెన్ సోదరుల విషయానికి వస్తే 300 మిలియన్ పౌండ్లతో బర్లింగ్‌టన్ ఆర్కేడ్‌లోని మేఫెయిర్స్, షోర్‌డిచ్‌లోని కర్టెన్ హోటల్‌ను కలిగి ఉన్నారు. అలాగే, గత జూలై నెలలో 2.1 బిలియన్ టన్నులకు గ్లోమల్ స్విచ్ డేటా సెంటర్లలోని తమ వాటాను విక్రయించినట్లు ‘సండే టైమ్స్’ వెల్లడించింది.