అంతర్జాతీయం

ఐక్యతా రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, మే 12: సంగీతానికి ఎల్లలు లేవు. దేశాల మధ్య శత్రుత్వాన్ని, ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు సంగీతం కూడా ఓ సాధనమే. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఉభయ కొరియాలకు చెందిన ఇద్దరు కళాకారులు చైనా వేదికగా ఆరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చగడ్డి లేకుండానే భగ్గుమనే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. ఈ శత్రుత్వం ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య దశాబ్దాలుగా వెళ్లూనుకున్న విషయం విదితమే. అయితే, ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలకు చెందిన ఇద్దరు కళాకారులు అరుదైన కార్యక్రమం నిర్వహించారు. సంగీత విభావరితో ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ముందడుగు వేశారు. దక్షిణ కొరియాకు చెందిన వయొలిన్ కళాకారుడు, ఉత్తర కొరియాకు చెందిన గాయకురాలు కలిసి షాంఘైలో సంగీత విభావరి నిర్వహించారు. దక్షిణ కొరియాకు చెందిన వయొలిన్ కళాకారుడు వాన్ హ్యూంగ్ జూన్, ఉత్తర కొరియాకు చెందిన గాయని కిమ్ సాంగ్ మి షాంఘై ఓరియంటల్ ఆర్ట్ సెంటర్‌లో చైనా ఆర్కెస్ట్రా సహకారంతో ఈ విభావరి నిర్వహించారు. గత ఏడాది పలుసార్లు కలుసుకున్న ఈ ఇద్దరు కళాకారులు ఉభయ కొరియాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తమ వంతు కృషి చేయాలని ఆలోచించేవారు. వీరిద్దరి సంకల్పం ఒకటే కావడంతో షాంఘై వేదికగా సంయుక్తంగా సంగీత కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో ఆదివారం ఈ అరుదైన కార్యక్రమం ఆవిష్కృతమైంది. ఆంటోనిన్ ద్వోరక్ పాటను కిమ్ ఆలపించగా దానికి అనుగుణంగా వాన్ వయొలిన్‌ను వీనులవిందుగా వాయించాడు. అలాగే ఉభయ కొరియాల ప్రజలు అత్యధికంగా ప్రేమించే సంప్రదాయ జానపద గీతం ‘అరిరంగ్’ను ఆలపించి అలరించారు. ‘కిమ్‌ను తొలిసారి కలిసినప్పుడు మా ఇద్దరి ఆలోచనలు ఒకే దిశగా సాగుతున్నాయని తెలుసుకున్నాను. ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొనాలనేదే మా ఆశయం. ఇది మా తొలి ప్రయత్నం. ఇంతటితో ఆగకుండా మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాం’ అని కార్యక్రమానికి ముందు వాన్ వ్యాఖ్యానించాడు. ఇదే సందర్భంలో గాయని కిమ్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి ముందు నేను ఒకింత ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో, అలాగే ఉభయ కొరియాల ప్రజలు దీన్ని ఎలా స్వాగతిస్తారోనని భయం ఉండేది’ అని వ్యాఖ్యానించింది. కాగా, ఉత్తర, దక్షిణ కొరియాలకు చెందిన కళాకారులు ఒకే వేదికను పంచుకోవడం అరుదైన విషయమే కాదు అసాధ్యం కూడా. ఎందుకంటే ప్రత్యేక అనుమతి లేనిదే ఫోన్ చేయడం గానీ, ఉత్తరాలు, ఈ-మెయిల్స్ పంపించేందుకు ఈ ఇరు దేశాల ప్రజలకు ఎంతమాత్రం అవకాశం లేదు. అత్యవసరమైతే ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. అలాంటిది ఉభయ కొరియాలకు చెందిన ఇద్దరు కళాకారులు షాంఘైలో కలిసికట్టుగా సంగీత విభావరి నిర్వహించడం విశేషమే.

చిత్రం...షాంఘై లో జరిగిన సంగీత కార్యక్రమంలో దక్షిణ కొరియా వయొలిన్ కళాకారుడు
వాన్ హ్యూంగ్ జూన్, ఉత్తర కొరియా గాయని కిమ్ సాంగ్ మి.