అంతర్జాతీయం

మళ్లీ రగులుకున్న లంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 13: శ్రీ లంక అంతఃకలహాలతో అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ముస్లింలకు చెందిన దుకాణాలపై, మసీదులపై దాడులు జరుగుతుండడంతో ప్రభుత్వం సోమవారం కర్ప్యూ విధించింది. హింసాకాండ కొత్త ప్రాంతాలకు వ్యాపించిన నేపథ్యంలో సామాజిక మీడియాను కట్టడి చేసింది. ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన దాడిలో 260 మంది మరణించిన అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకుంటున్న సమయంలో తాజాగా అల్లర్లు రగులుకున్నాయి. మసీదులు, దుకాణాలపై దాడులు చేస్తున్న అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించామని సీనియర్ అధికారి తెలిపారు. కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లుగా ఆర్మీ చీఫ్ మహేష్ సేనానాయకే తెలిపారు. మొదట్లో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన హింసాకాండ క్షణాల్లో ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలతో కర్ఫ్యూ విధించామని ఆయన వెల్లడించారు. జాతిని ఉద్ధేశించి మాట్లాడిన ప్రధాని విక్రమసింఘే ముస్లిం వ్యతిరేక అల్లర్లను అణచి వేసేందుకు సైన్యానికి పూర్తి అధికారాలను అందించామని తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాగే తప్పుడు సమాచారాన్ని ఆసరా చేసుకుని ఎవరూ ఆందోళనలకు లోనుకావాల్సిన అవసరం లేదన్నారు. దేశ భద్రతను కాపాడేందుకు అరాచకాలను రగిలిస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు జవాన్లు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. దేశంలో అశాంతి నెలకొన్నప్పుడల్లా వారిపై మరింత భారం పెరుగుతోందని, ప్రస్తుత దర్యాప్తుకు అవరోధం కలుగుతోందన్నారు. మైనారిటీ ముస్లింలు, మెజారిటీ సింహాళీయుల మధ్య అల్లర్లు రగులుకోవడంతో సామాజిక మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించింది.