అంతర్జాతీయం

లంకలో ఆగని అల్లర్లు, హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 14: శ్రీ లంకలో చెలరేగిన ముస్లిం వ్యతిరేక ఘర్షణలు చిలికిచిలికి గాలి వానగా చందంగా మారాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా అల్లర్లు ఆగలేదు, ఉద్రిక్తత, హింస కొనసాగుతున్నది. హింసాయుత ఘటనలతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం వేర్వేరు ఘటనల్లో 24 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెజారిటీ వర్గమైన సింహాళీయుల అల్లరి మూకలు ముస్లింలకు చెందిన దుకాణాలకు, వాహనాలకు నిప్పంటించారు. ముస్లీంలపై దాడులు జరుగుతున్నందున పోలీసులు సోమవారం నిరవధిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇళ్ళపై, మసీదులపై దాడులు కొనసాగుతున్నాయి. సింహాళీయులు గుంపులు, గుంపులుగా కర్రలు, ఇతర మారణాయుధాలు పట్టుకుని వీధుల్లోకి వస్తుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సోషల్ మీడియాపై నిషేధం
ఇలాఉండగా లంక ప్రభుత్వం ట్విట్టర్, ఫేస్ బుక్, సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో మరింతగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఈస్ట్రన్ సండే నాడు మూడు చర్చిల్లో, మూడు నక్షత్రపు హోటళ్ళలో ఉగ్రవాదులు, ఆత్మాహుతి దళాలు వరుసగా బాంబులు పేల్చడంతో 258 మంది మరణించగా, సుమారు 500 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో లంక ప్రభుత్వం ఈ ఘటనలపై విచారణకూ ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు ప్రముఖ వ్యక్తులతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన తెలిపారు. పోలీసు చీఫ్ చందనా విక్రమారత్నే మీడియాతో మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న వారికి బెయిల్ ఇవ్వమని, వారికి కనీసం పదేళ్ళు కారాగారంలో ఉండాల్సిందేనని అన్నారు. ప్రధాని రాణిల్ విక్రమాసింఘే మాట్లాడుతూ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర రాజపక్స మాట్లాడుడూ అల్లర్లను అదుపు చేయడంలో ప్రభుత్వం విపలమైందని విమర్శించారు. అల్లర్లకు దిగినా, ఆస్తులకు నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని లంక ఆర్మీ చీఫ్ లెఫ్టెనెంట్ జీఎం సేనానాయకే హెచ్చరించారు. ఇలాఉండగా మూడు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను రాష్టప్రతి మైత్రిపాల సిరిసేన నిషేధించారు. డ్రోన్ కెమెరాల వాడకాన్ని కూడా ఆయన నిషేధించారు.

చిత్రం...అల్లరి మూకలు ధ్వంసం చేసిన ముస్లింలకు చెందిన దుకాణాలు