అంతర్జాతీయం

ఈ అపార్ట్‌మెంట్ ఖరీదు 20 మిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, మే 15: దుబాయిలోని పేరు మోసిన దీవి పామ్ జుమెయిరాలో నిర్మించిన ఒక అపార్ట్‌మెంట్ 20 మిలియన్ డాలర్ల ధర పలికింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) స్థిరాస్తి రంగం చరిత్రలోనే ఇది రెండో అత్యంత ఖరీదయిన అపార్ట్‌మెంట్‌గా రికార్డు సృష్టించింది. 20వేల చదరపు అడుగుల వైశాల్యం గల ఈ అపార్ట్‌మెంట్‌ను పామ్ జుమెయిరా దీవిలోకి ప్రవేశిస్తుండగా ఉన్న ఒక ప్రధాన ప్లాట్‌లో నిర్మించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండి అబ్బురపరిచే దుబాయి మెరీనా బీచ్ అందాలను, అరేబియన్ గల్ఫ్ దృశ్యాలను తిలకించవచ్చు. ఆధునిక సౌకర్యాలన్నీ కలిగి ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ఎంతో విలాసవంతమయిందని దీనిని నిర్మించిన దుబాయిలోని స్థిరాస్తి అభివృద్ధి గ్రూప్ ఓమ్‌నియత్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) మహ్‌దీ అమ్జద్ తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్‌ను 73 మిలియన్ దీరాంలకు (20 మిలియన్ డాలర్లకు) విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. ఇదే కంపెనీ 2017లో దుబాయిలోని అత్యంత ఖరీదయిన అపార్ట్‌మెంట్‌ను 102 మిలియన్ దీరాంలకు విక్రయించి చరిత్ర సృష్టించింది.