అంతర్జాతీయం

మనుషుల్లాగే చూసే ఏఐ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, మే 16: శాస్తజ్ఞ్రులు ఒక కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యవస్థకు మనుషుల వలె వస్తువులను చూసేలా శిక్షణ ఇచ్చారు. ఈ వ్యవస్థ చుట్టూ ఉన్న వాతావరణంలోకి ఒక్కసారి అలా చూసి, ఎక్కడెక్కడ ఏమున్నా క్షుణ్ణంగా పసిగడుతుంది. గాలింపు, సహాయక చర్యల రోబోలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ వ్యవస్థ మార్గం సుగమం చేసింది. అనేక కృత్రిమ మేధస్సు (ఏఐ) పరికరాలు వాతావరణంలోని అంతకు ముందు తాము చూసి ఉన్న వస్తువులు అగుపడితే వాటిని గుర్తించడంతో పాటు వాటి పరిమాణాన్ని అంచనా వేసేట్లుగా శాస్తజ్ఞ్రులు శిక్షణ ఇచ్చారు. నిర్దిష్టమయిన లక్ష్యాలను సాధించడానికి వారు ఇలా శిక్షణ ఇచ్చారు. అమెరికాలోని ఆస్టిన్‌లో గల యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్‌కు చెందిన శాస్తజ్ఞ్రులు దృశ్య సంబంధ సమాచారాన్ని సేకరించడం వంటి సాధారణ లక్ష్యాలను సాధించడానికి ఒక ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోరుకున్నారు.